కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా పలు పిటీషన్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందకు రాగా, వీటిపై విచారించిన న్యాయస్థానం కేంద్ర తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. ఈ చట్టాలను మీరు పక్కన బెడతారా,; లేక మమల్నే ఆ పని చేయమంటారా? అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించిన 24 గంటల వ్యవధిలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ మూడు నూతన చట్టాల అమలుపై స్టే విధిస్తూ తాజాగా అదేశాలను జారీ చేసింది.
తాము తదుపరి అదేశాలు జారీ చేసే వరకు స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది. ఇక ఇదే సమయంలో రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జితేందర్ సింగ్ మాన్, ఇంటర్నేషనల్ పాలసీ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అగ్నికల్చరల్ ఎకనామిస్ట్ అశోక్ గులాటి, మహారాష్ట్రకు చెందిన శివ్ కేరి సంఘటన నేత అనిల్ ధన్వంత్ కమిటీ సభ్యులుగా ఉంటారని న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానానికి వున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను జఠిలం కాకుండా పరిష్కార మార్గం చూపేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని ప్రధాన న్యాయమూర్తి ఏస్ఎ బోబ్డే పేర్కోన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్లపై ఇవాళ విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని న్యాయస్థాన ధర్మాసనం ఈ మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే అంశాన్ని పరిగణలోకి తీసుకుని తమకున్న విశిష్ట అధికారల పరిధిలో సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
కాగా, రైతుల న్యాయస్థానాలు ఏర్పాటు చేసే ఏ కమిటీ ఎదుట హాజరై తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్దంగా లేరని అన్నదాతల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇక తమతో చర్చలు అనేక మంది వస్తున్నారని.. కానీ ప్రధాన మంత్రి మోడీ మాత్రం రావడం లేదని రైతులు భావిస్తున్నారని, ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రధానిని చర్చలకు వెళ్లమని చెప్పలేమని న్యాయస్థానం పేర్కోంది. రైతుల నిరసనలకు నిషేదిత సంస్థ సహకరిస్తోందంటూ దాఖలైన పిటీషన్ పై ప్రభుత్వ వాదనలు వినిపించే అటర్నీ జనరల్ ను న్యాయస్థానం సూటిగా ప్రశ్నించగా, ఖలిస్తానీలు నిరసనల్లో చొరబడ్డారని మాత్రమే తాము న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని భావించామని కేకె వేణుగోపాల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more