One more temple attacked in Singarayakonda! సింగరాయకొండ ఆలయ కమాన్ పైనున్న విగ్రహాల ధ్వంసం

Tension at singarayakonda as temple arch suffers damage

Tension, arch, idol, Lord, Singarayakonda

Tension gripped Singarayakonda, abode of Lord Lakshmi Narasimhaswamy when the hand of the Lord's image in the arch, leading to the historic temple in Prakasam district, was found broken on Tuesday.

ఏపీలో ఆగని విగ్రహాల ధ్వంసం.. చారిత్రక సింగరాయకొండ దేవాలయం కూడా..

Posted: 01/05/2021 08:43 PM IST
Tension at singarayakonda as temple arch suffers damage

(Image source from: Telugubulletin.com)

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలపై దాడులకు చెక్ పడటం లేదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై ఓ వైపు రాస్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్ని ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చిన తరుణంలో తాజాగా మరో దేవాలయంలోనూ దేవతా విగ్రహాల ధ్వంసం కోనసాగింది. బీజేపి, జనసేన పార్టీలు రామతీర్థం ధర్మయాత్రను చేపట్టడం.. అందుకు పోలీసులు అనుమతిన నిరాకరించడం.. ఈ క్రమంలో అరెస్టులు, పోలీసులకు బీజేపి, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన కలకలం రేపింది.

ప్రకాశం జిల్లాలోని సింగరాయ కొండ మండలంలోని పాత సింగరాయకొండలో చారిత్రక నేపథ్యమున్న దేవాలయాన్ని దుండగలు టార్గెట్ చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయులు నిర్మించిన దేవాలయం.. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిచెందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని టార్గెట్ చేసిన దుండగులు.. ఆలయానికి వెళ్లే ముఖ ద్వారం (కమాన్)పై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ, శ్రీ గరుత్మంతుడు మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో దేవతామూర్తుల విగ్రహాల చేతులు విరిగిపోయాయి. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ముఖద్వారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి దాడి జరగలేదని నిర్ధారించారు. దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్మించిన ముఖద్వారం కావడంతో సిమెంట్ పెచ్చులు విరిగిపడ్డట్లు తేల్చారు. ఇక ఆ ప్రాంతమంతా అదుపులోకి తీసుకుని బందోబస్తు నిర్వహించారు. ప్రకాశం జిల్లా అదనపు ఎస్సీ బి.రవిచంద్ర ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహాలు ధ్వంసం చేశారంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ఆలయ ఈవో బైరాగి కూడా ఇది దుండగులు చేసిన పనిగా నిర్థారించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tension  arch  idol  Lord  Singarayakonda  

Other Articles