Centre-Farmer Talks On Repeal Of Farm Laws కేంద్రంతో ఏడో దఫా రైతు సంఘాల చర్చలు.. సఫలమయ్యేనా..?

Farmers unions threaten to intensify protests if january 4 talks fail

India, Farmers, shut malls, shut petrol bunks, Supreme Court, resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress

A delegation of farmer leaders arrive at Vigyan Bhawan for talks with Union government on the three farm laws. 'We hope there is a breakthrough in this meeting in the new year,' says a farmer leader. Ahead of their talks with the government, the farmer leaders reiterated.. 'Our demands remain the same. The farm laws must be repealed. The two amendments need to be rolled back and the government must listen. Our agitation will continue,'

కేంద్రంతో ఏడో దఫా రైతు సంఘాల చర్చలు.. సఫలమయ్యేనా..?

Posted: 01/04/2021 02:17 PM IST
Farmers unions threaten to intensify protests if january 4 talks fail

(Image source from: Thehindu.com)

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశరాజధాని శివార్లలోని సింఘు, టిక్రీ ప్రాంతంలో రైతు సంఘాలు చచేపడుతున్న ఆందోళనలు ఇవాళ కొలిక్కి వచ్చేనా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెల రోజులకు పైగా సాగుతున్న రైతుల అందోళనలకు ఇవాళ జరగుతున్న ఏడో విడత చర్చలు ముగింపు పలుకుతాయా.? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తమ డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా దిగిరాని పక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని.. మాల్ లు, పెట్రోల్ బంకులు మూసివేయిస్తామని ఇదివరకే హెచ్చరించిన రైతు సంఘాలు.. ఢిల్లీలో కురుస్తున్న వర్షానికి కూడా వెరవకుండా అక్కడే అందోళనలు చేపడుతున్నారు.

కాగా ఇవాళ కేంద్రంతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇప్పటికే రైతు సంఘాల నేతలు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో పాల్గోంనేందుకు ముందు మీడియాతో మాట్లాడిన రైతు సంఘాల నేతలు తమ డిమాండ్లు ఇదివరకు మాదిరే కేంద్ర ప్రభుత్వం ముందు స్పష్టంగా వుంచామని అన్నారు. వాటిల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవన్నారు, కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని, కనీస మద్దుత ధరకు చట్టబద్దత కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. కేంద్రం సానుకూలంగా దిగిరాని పక్షంలో ఈ నెల 6న ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామన్నారు.

అసలే చలికాలం.. అందులోనూ ఏకంగా రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఓవైపు రైతులపై ప్రభవాన్ని చాటుతున్నాయి. మరోవైపు వరుణుడు కూడా రైతన్నలపై పగబట్టినట్టు కురువడంతో రైతున్నలు తడిసిముద్దవుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో, తమ ఉద్యమం ముందు ఇవాన్ని తాత్కాలిక అవాంతరాలేనని ఆత్మవిశ్వాసంతో అందోళనలో పాల్గోంటున్నాడు. తమ ఉనికికే ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని భీష్మిస్తున్నారు. రైతులు సాగిస్తున్న ఈ ఉద్యమానికి క్రికెటర్లు, ఇటు సినీ నటీనటులు, మరోవైపు విద్యావేత్తలు మద్దతు ప్రకటించారు. ఇక కార్మిక సంఘాలు కూడా తాము రైతులతోనే వున్నామని ఇదివరకే ప్రకటించి భారత్ బంద్ లో పాల్గోన్నాయి.

ఇన్నాళ్లు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలతో గత నెల 30న కేంద్ర ప్రభుత్వం చర్చలు ఈ అడుగు ముందుకు పడిందన్న వార్తలు వచ్చాయి, అయితే కొన్ని రైతు సంఘాలు మాత్రం ఈ వార్తలను ఖండించాయి. కాగా అరో విడత సమావేశంలో ఇరు వర్గాల మధ్య కొంత ఏకాభిప్రాయం మాత్రం వచ్చింది. కీలకమైన చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్దత హామీపై ప్రతిష్టంభన మాత్రం కోనసాగుతూనే వుంది. కాగా ఈ రెండే తమ ప్రధాన డిమాండ్లని, వీటి విషయంలో ఎట్టి పరిస్థిుతుల్లో వెనక్కి తగ్గే అవకాశాలే లేవని అన్నారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు అనుకూలంగా లేదని సమాచారం, మరి ఇవాళ చర్చలు సఫలమౌతాయా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles