AstraZeneca's Covid vaccine not approved by EU ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సీన్ కు అనుమతినివ్వని యూరోపియన్ యూనియన్

Oxford covid 19 vaccine not ready for market approval says european regulatory official

Coronavirus vaccine, Coronavirus vaccine update, Coronavirus vaccine in India, Serum Institute covaxin price, Serum Institute covaxin launch 2021 q1, Serum Institute covaxin launch, Serum Institute covaxin, Serum Institute Coronavirus vaccine update India, COVID19 vaccine, COVID19 vaccine news, COVID19 vaccine India, COVID19 vaccine update, COVID19 vaccine progress, COVID19 vaccine name

The European Medicines Agency (EMA) has maintained that it is unlikely to give a nod to AstraZeneca and Oxford University’s Covid-19 vaccine in January 2021, CGTN reported. The EMA’s deputy executive director Noel Wathion said that the pharmaceutical company 'has not even filed an application' with the European drug regulators yet.

ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సీన్ కు అనుమతినివ్వని యూరోపియన్ యూనియన్

Posted: 12/30/2020 07:35 PM IST
Oxford covid 19 vaccine not ready for market approval says european regulatory official

యావత్ మానవాళిపై ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ పూర్తై సానుకూల నివేదికలు వచ్చిన పలు దేశాలు ఇప్పటికే వాక్సీనేషన్ ను కూడా అందిస్తున్నాయి. భారతీయ ఫార్మదిగ్గజ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తో సంయుక్తంగా టీకాను తయారు చేసిన అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, అస్ట్రాజెనికా సంస్థలకు యూరోపియన్ దేశాలు షాక్ ఇచ్చాయి. వీరు రూపోందించిన కరోనా వ్యాక్సిన్ కు తక్షణం అనుమతించే అవకాశాలు లేవని యూరోపియన్ యూనియన్ అధీనంలోని ఔషధ నియంత్రణ సంస్థ ఈఎంఏ (యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ) తేల్చి చెప్పింది.

ఈ వ్యాక్సిన్ పై ఇంకా పూర్తి సమాచారం తమకు చేరలేదని స్పష్టం చేసిన ఈఎంఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోయల్ వాటియన్, ఇప్పటివరకూ ఆ సంస్థ తమ వ్యాక్సిన్ కు అనుమతించాలని దరఖాస్తు కూడా చేసుకోలేదని అన్నారు. బెల్జియం వార్తా పత్రిక 'హెట్ న్యూస్ బ్లాడ్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఆస్ట్రాజెనికా టీకాకు, నిబంధనలతో కూడిన మార్కెటింగ్ లైసెన్స్ ఇవ్వడానికి అవసరమైన గణాంకాలు కూడా అందలేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ పై మరింత సమాచారం అందాల్సి వుందని, ఆ తరువాతే తాము ఓ నిర్ణయానికి రాగలమని వెల్లడించారు నోయల్ వాటియన్,

ఇందుకు కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. కాగా, గతవారం ఆస్ట్రాజెనికా చీఫ్ పాస్కల్ మాట్లాడుతూ, తమ వ్యాక్సిన్ కరోనా నుంచి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కొత్త వైరస్ స్ట్రెయిన్ నుంచి కూడా ఇది రక్షిస్తుందని ఆయన అన్నారు. ఇదిలావుండగా, బ్రిటీష్ ఔషధ నియంత్రణ సంస్థలకు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికే చేరింది. దీని వాడకానికి త్వరలోనే అనుమతులు లభించవచ్చని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన నోయల్ వాటియన్, బ్రిటన్ అధికారులకు చేరిన వ్యాక్సిన్ సమాచారం కూడా తమ వద్ద లేదని అన్నారు. బ్రిటన్ ప్రభుత్వం టీకాను అనుమతిస్తే, మిగతా ఈయూ దేశాల్లో కొన్ని పరిమితులతో కొంతమందికి వ్యాక్సిన్ ను పంచేందుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏదిఏమైనా అత్యుత్తమ క్వాలిటీ ఉన్న టీకాను ప్రజలకు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈయూ దేశాలకు 30 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తొలిదశలో, ఆపై మరో 10 కోట్ల డోస్ లను రెండో దశలో ఇచ్చేందుకు గత ఆగస్టులోనే ఆస్ట్రాజెనికా ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles