Hyderabad man shot at by armed robbers in Chicago అమెరికా గన్ కల్చర్: చికాగోలో హైదరాబాద్ వాసీపై కాల్పులు..

Hyderabad man shot in us family seeks support from indian government

Hyderabad man shot in US, family seeks support from Indian govt, Mohammed Mujeebuddin, cab driver, Illinois, Mohammaed Mutayeeb Uddin, carjacking, Amjedulla khan, MBT, US, chicago, Hyderabad, US consulate general, Indian embassy, Ministry of external affairs, Politics, Crime

A 43-year-old man from Hyderabad, Mohammed Mujeebuddin, suffered bullet injuries in the early hours of Monday during a carjacking attempt in Chicago, United States of America. His worried family members in Hyderabad have reached out to the Indian government for assistance and are awaiting their response.

అమెరికా గన్ కల్చర్: చికాగోలో హైదరాబాద్ వాసీపై కాల్పులు..

Posted: 12/22/2020 09:11 PM IST
Hyderabad man shot in us family seeks support from indian government

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు గన్ కల్చర్ చర్చనీయాంశంగా మారింది. ఎవరి వద్ద పడితే వారి వద్ద గన్ ఉండటం.. ఆమాయకుల ప్రాణాలకు బలవుతున్నాయి. అమెరికాలోని చికాగో నగరంలో తాజాగా జరిగిన కాల్పులలో హైదరాబాద్ నగరవాసిని ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. అగ్రరాజ్యంగా బాసిల్లుతున్న అమెరికాలో కొందరు స్థానికులు పరాయిదేశ ప్రజలను దొచుకోవడం పరిపాటిగా సాగుతోంది. పొట్టచేత బట్టుకుని దేశం కాని దేశానికి వలసవచ్చిన వలసవాదులను చూసి వారు అప్పటికప్పుడు దొంగతనాలకు స్కెచ్ వేస్తుంటారు. పరాయిదేశ ప్రజల చేతుల్లో ఏ ఖరీదైన వస్తువు కనిపించినా.. దాని తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడి లాక్కోవడం అలవాటుగా మారింది.

దానిని ఇచ్చేందుకు నిరాకరించినా.. లేక ఏ మాత్రం కదిలినా విఛక్షణ కోల్పోయి దుండగులు కాల్పులకు తెగబడతారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ఎందరో. ఐ పోన్ల కోసం, ఐ ప్యాడ్ ల కోసం కూడా కాల్పులకు తెగబడిన ఘటనలు వున్నాయి. ఆ కాల్పుల్లో మరణించిన వారు వున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్ పై అమెరికాలో కాల్పులు జరిగాయి. ఆయన తలకు బుల్లెట్ గాయమైంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2016లో అమెరికా వెళ్లి ముజీబ్ అక్కడ ఉద్యోగం చేస్తుండగా, ఆయన భార్య అఫ్రోజ్ కౌసర్, ఇద్దరు కుమారులు, కుమార్తెలు సంతోష్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.

భారత కాలమానం ప్రకారం ఇల్లినాయిస్ లో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ముజీబ్ తలకు తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో ఇంటికి వస్తానని మొన్ననే ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే ఇలా జరిగిందంటూ భార్య కౌసర్ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, తన బాధితుడు తీవ్ర ప్రాణాపాయస్థితిలో వున్నాడని.. అతనికి వెంటనే సాయం చేయాలని బాదితుడి కుటుంబం తరుపున ఎంబిటి పార్టీ నాయకుడు అంజదుల్లా ఖాన్ భారత విదేశాంగశాఖకు లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles