Good news to sabarimala Ayyappa devotees శబరిమల అయ్యప్ప భక్తులకు మరో శుభవార్త.!

Sabarimala lord ayyappa temple opens for 5000 pilgrims per day

Sabarimala temple, Sabarimala temple news, Sabarimala temple opening date, Sabarimala temple this year, Sabarimala temple restrictions, Sabarimala temple coronavirus, Sabarimala temple latest, Sabarimala temple november, Sabarimala temple Mandalam, Sabarimala temple Kerala government, Sabarimala temple no entry, Sabarimala temple for outsiders, Sabarimala temple 2020 news, Sabarimala Temple to Open from November 16th with Restrictions

The popular Sabarimala temple in Kerala opened its doors for the pilgrims since November 16th as the busy Mandalam-Makaravilakku season begins. The Board had asked the pilgrims to follow covid rules and issued few restrictions allowing only 1000 pilgrims a day for Ayyappa Darshan. But now as the scare of coronavirus is reduced it sent good news to the pilgrims allowing 5000 devotees a day for darshan.

అయ్యప్ప భక్తులకు ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు మరో శుభవార్త.!

Posted: 12/22/2020 08:15 PM IST
Sabarimala lord ayyappa temple opens for 5000 pilgrims per day

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలల్లో భక్తుల కోసం ద్వారాలు తెరుచుకున్నా.. కోవిడ్ నేపథ్యంలో అంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. కేరళ శబరిమల కొండల్లో నెలవైన అయ్యప్ప స్వామి భక్తులకూ ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. మలయాళ నూతన సంవత్సరం విస్సు సందర్బంగా ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మూసివేసిన ఆయ్యప్ప స్వామి దేవాలయం ఆ తరువాత నవంబర్ 16 నుంచి మండల పూజ సందర్భంగా తెరుచుకున్నాయి. అయితే అప్పట్నించే భక్తులకు స్వామివారిని దర్శించే అవకాశం లభించినా.. కేవలం పరిమితి సంఖ్యలోనే భక్తులను కొండపైకి అనుమతించారు.

తొలుత నవంబర్ లో రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతించిన అధికారులు.. ఆ తరువాత సంఖ్యను 1000 మందికి, వారాంతాల్లో 2 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించారు. మరో పర్యాయం ఈ సంఖ్యను పెంచుతూ రెట్టింపు సంఖ్యలో భక్తులను అనుమతించారు. తరువాత ఏకంగా రోజుకు రెండు వేల మంది భక్తులతో పాటు వారాంతంలో 3 వేల మందిని స్వామి దర్శనానికి అనుమతించారు. ఇక తాజాగా ఈ సంఖ్యను మరింతగా పెంచుతూ కేరళ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఖ్యలను రోజుకు ఐదు వేలకు పెంచుతూ న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది. దీంతో ఇక ఇవాళ్టి నుంచి రోజుకు ఐదు వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించనుంది.

అయితే ఐదువేల మందిని శబరికొండపైకి అనుమతించినా.. అక్కడ నివసించేందుకు మాత్రం ఎవరికీ అనుమతి లేదని గతంలో జారీ చేసిన అన్ని అంక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. తప్పనిసరిగా వర్చువల్‌ క్యూలో వివరాలు నమోదు చేసుకున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇదిలావుండగా, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం పక్కా మార్గదర్శకాలను రూపొందించారు ఆలయాధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిబంధన పెట్టారు. పంబ చేరిన తరువాత అక్కడి పిసీఆర్ లో భక్తులు కోవిడ్ నెగిటివ్ నిర్థారణ సర్టిఫికేల్ సమర్పించాలని పేర్కోన్నారు.

కోవిడ్ లేదని నిర్థారించిన నివేదిక ఉన్న భక్తులను మాత్రమే కొండపైకి అనుమతిస్తామని తెలిపారు. కాగా ఇంతకుముందు కేవలం యాంటీజెన్‌ టెస్టులో పరీక్ష రిపోర్టు ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించారు. కానీ, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 19 వరకు జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) పండుగ వేళ నెగటివ్‌ రిపోర్టు(RTPCR) లేని భక్తలను కొండపైకి అనుమతించమని టీబీడీ బోర్డు అధ్యక్షుడు స్పష్టంచేశారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొన్నట్టుగా ఉన్న కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles