ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అన్ లాక్ నేపథ్యంలో జూన 1 నుంచి అంతకంతకూ పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు విపక్షాల అందోళనలు కాసింత కళ్లాలు వేశాయి, అయితే ప్రస్తుతం మరోమారు ఇంధన ధరలు పెరిగాయి. తోమ్మిది రోజుల వ్యవధిలో ఎనమిదవ పర్యాయం పెట్రోల్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 24 పైసలు.. లీటరు డీజిల్ పై 28 పైసల మేర ధరను పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.82.13 కి చేరగా, లీటరు డీజిల్ ధర రూ.72.13కు చేరింది. గత తొమ్మది రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై 1.07 పైసలు పెంచగా, డీజీల్ పై రూ.1.67 పెంచాయి. దీంతో పలు నగరాల్లో పెట్రోల్ ధర ఏకంగా రూ.89ను అందుకునేందుకు పరుగులు తీస్తోంది.
మరోవైపు గత కొంత కాలంగా స్థిరంగా కోనసాగుతూ.. రూ. 80 అటుఇటుగా సాగిన పెట్రోల్ ధరరెండు వారాలుగా డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.72.13గా ఉంది. పలు నగరాల్లో డీజిల్ ధర ఏకంగా రూ.81 దాటింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటం.. బ్యారెల్ ముడి చమురు ధర 39.30 డాలర్లు దాటడం వల్ల దేశీయ చమురు సంస్థలు ధరల్లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్దిపై సానుకూల ఫలితాలు వస్తున్నాయన్న సంకేతాలతో ఇంధర ధరలకు రెక్కలు వస్తున్నాయి, అంతర్జాతీయ ధరలకు అనుగూణంగా చమురు కంపెనీలు ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయడంతో ధరల పెరుగుదల ప్రభావం దేశీయంగానూ ప్రభావాన్ని చూపుతోంది, తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 82.13గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 72.13కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 88.81గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 78.66కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 85.13గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 77.56కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 83.67గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 75.70కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 88.41 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 81.24కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 88.22గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 81.07కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 85.42గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 78.71కు చేరింది.
దేశంలోని ఔరంగాబాద్, భూపాల్, నాగ్ పూర్, నాసిక్, కోల్హాపూర్, ఇండోర్, జైపూర్ నగరాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.90 మార్కుకు చేరువలో వుంది. అదే విధంగా ఔరంగాబాద్, భూపాల్, భువనేశ్వర్, గువహటి, హైదారబాద్, ఇండోర్, ముంబై, నాగ్ పూర్, థానే, విశాఖపట్నం నగరాల్లో డీజిల్ ధర లీటరుకు ఎనబై రూపాయలు దాటగా, జైపూర్ లో మాత్రం ఏకంగా రూ.82 దాటింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more