Bandi Sanjay pays tribute to PV, NTR జీహెచ్ఎంసీ ఎన్నికల: పీవీ ఘాట్ కు బండి సంజయ్..

Ghmc elections bandi sanjay visits pv ntr ghat fires on mim

Bandi Sanjay, PV Ghat, NTR Ghat, KTR, CM KCR, GHMC Elections, TDP, Somireddy Chandra Mohan reddy, GHMC Elections, GHMC Elections Amit Shah, GHMC Elections YogiAdityanath, GHMC Elections JP Nadda, Amit Shah, YogiAdityanath, JP Nadda, GHMC Election Campaign, Dubbaka Assembly, Greater Hyderabad Elections, BJP, Hyderabad, Telangana, Politics

Buoyed by the victory in Dubbaka Assembly by-election in Telangana, the BJP State leadership is giving top priority to capturing the GHMC elections. BJP telangana presidnet Bandi Sanjay visits PV Ghat and NTR Ghat and pays tribute. After his visit he fires on MIM and MIM party MLA Akbaruddin owaisi.

జీహెచ్ఎంసీ ఎన్నికల: పీవీ ఘాట్ కు బండి సంజయ్.. ఎంఐఎం, టీఆర్ఎస్ లపై ఫైర్

Posted: 11/26/2020 10:35 PM IST
Ghmc elections bandi sanjay visits pv ntr ghat fires on mim

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తర ప్రచారంతో కొనసాగుతున్నాయి, మరో మూడు రోజుల వ్యవధిలో ప్రచార పర్వానికి తెరలేవనున్న నేపథ్యంలో ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్తూ.. పార్టీలు కార్యకర్తలు, అభిమానులను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి, గత పర్యాయం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు అధికార పార్టీకి నల్లేరుపై నడకలా సాగినా, ఈ పర్యాయం మాత్రం బీజేపి నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోంటోంది. దుబ్బాక ఉపఎన్నిక అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న బీజేపి శ్రేణులను మరింత భావోద్వేగానికి గురిచేసేలా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు వ్యూహాలను రచిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌ నగరంలో వరద ముంచెత్తిన నేపథ్యంలో అదే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రాంగా మారింది. 12 వేల కోట్ల రూపాయలతో ఎంత వర్షం కురిసినా కాలనీలు నీట మునగకుండా చర్యలను తీసుకుంటామని అధికార టీఆరఎస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇక దీంతో పాటు నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కూడా ప్రభుత్వం పేర్కొనింది. దీనిపై ధీటుగా స్పందించిన ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ.. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావుల ఘాట్ లను కూడా కూల్చివేయాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య అగ్గిని రాజేశాయి.

అక్బరు్దదీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ కూడా అంతే స్థాయిలో ధీటుగా జవాబిచ్చింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపటి క్రితం పీవీ ఘాట్ కు వెళ్లారు. ఆయన సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పినప్పటికీ ఆయన అక్కడకు వెళ్లి పీవీకి నివాళులర్పించారు. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి అక్కడ నివాళులు అర్పించారు, ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లేముందు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అక్బరుద్దీన్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్, పీవీలను విమర్శించే స్థాయి అక్బరుద్దీన్ కు లేదని, వారి కాలి గోటికి కూడా ఆయన.. ఆయన పార్టీ సరిపోవని సంజయ్ తీవ్రంగా దుయ్యబట్టారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న ఆయన.. పీవీ, ఎన్టీఆర్ లపై గౌరవం ఉంటే ప్రభుత్వం అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాల కుట్రలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని బండి సంజయ్ అన్నారు. ఏపీ బీజేపీతో కలిసి తాము కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ ఘాట్‌పై అక్బరుద్దీన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే టీడీపీ స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే తప్పేం లేదు కదా? అని నిలదీశారు.

‘తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, పీవీ నరసింహరావు గార్ల ఘాట్లను కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనడం దుర్మార్గమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వీరు హిందువులు, ఆంధ్రులని కాదు.. జాతి నాయకులు.. భారతీయులమై ఈ మహానుభావులను సంకుచిత దృక్పథంతో చూడటం క్షమించరాని విషయం’ అని సోమిరెడ్డి మండిపడ్డారు. ‘వీరి విషయంలో ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరపాటు. ఇది రాజకీయం కాదు.. అరాచకీయం.. రేపు ఇంకొకరు వచ్చి మరొకరి సమాధులో, విగ్రహాలో కూల్చాలంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఈ పోకడను తీవ్రంగా ఖండిస్తున్నాను.. వీరి విషయంలో మరోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని సోమిరెడ్డి హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandi Sanjay  PV Ghat  NTR Ghat  KTR  CM KCR  GHMC Elections  TDP  Somireddy Chandra Mohan reddy  BJP  Hyderabad  Telangana  Politics  

Other Articles