Sasikala will be released from jail as per court orders శశికళ ముందస్తు విడుదల లేదన్న ప్రభుత్వం

Sasikala will be released from jail as per court orders prison norms basavaraj bommai

VK Sasikala release, J Jayalalithaa's aide Sasikala, sasikala Latest News, V K Sasikala, sasikala, Tamil Nadu assembly Elections, Basavaraj Bommai, Karnataka Home Minister, Bengaluru Prison, Karnataka government

The release of former Tamil Nadu Chief Minister, the late J Jayalalithaa's aide V K Sasikala, who is undergoing imprisonment at a jail here in a disproportionate assets case, will happen as per court judgement and prison norms,Karnataka Home Minister Basavaraj Bommai said.

శశికళ ముందస్తు విడుదల లేనట్లే.. కోర్టు తీర్పే శిరోధార్యమన్న ప్రభుత్వం

Posted: 11/21/2020 07:15 PM IST
Sasikala will be released from jail as per court orders prison norms basavaraj bommai

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత నిచ్చెలి శశికళ ముందుస్తు విడుదల వార్తలపై కర్ణాటక ప్రభుత్వం తాజాగా నీళ్లు చల్లింది. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టై నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సిందిగా న్యాయస్థానం తీర్పును ఇవ్వడంతో.. అమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం అదేశానుసారం అమెకు విధించిన జరిమానా రూ. పది కోట్ల రూపాయలను అమె తరపు న్యాయవాది ఎన్ రాజా సెంథూర్ పాండియన్ 34వ సిటీ సివిల్ కోర్టులో గత బుధవారం చెల్లించారు. దీంతో శశికళ ముందస్తు విడుదల వార్తలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయమై తాజాగా కర్ణాటకా ప్రభుత్వం క్వారిటీ ఇచ్చింది. ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ఈ విషయమై స్పందిస్తూ శశికళ ముందస్తు విడుదల అసాధ్యమన్నారు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును తమ ప్రభుత్వం తూచ తప్పకుండా పాటిస్తుందని.. న్యాయస్థానం తీర్పు మేరకు శశికళ తన పూర్తి శిక్ష కాలం పూర్తైన తరువాతే విడుదల అవుతుందన్నారు. అయితే రూ. 10 కోట్ల జరిమానా చెల్లించిన తరువాత ఏ క్షణంలో అయినా అమె జైలు నుంచి విడుదల కావచ్చునని వచ్చిన వార్తలకు ఇక బ్రేక్ పడినట్టు అయ్యింది, చట్టప్రకారమే అంతా జరుగుతుందని ఆయన చెప్పడంతో అమె విడుదల ఫిబబ్రవరిలోనే జరుగుతుందని దీంతో ఆమె ముందస్తు విడుదల కోసం ఎదురుచూస్తున్న బంధువులు, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

నిజానికి నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించిన తరువాత.. శశికళ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది. అయితే జైలులో అమె సత్ప్రవర్తన కారణంగా జనవరి 27న విడుదల చేయనున్నట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. జైలులో ఉన్న శశికళ నాలుగేళ్ల కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే, అది కూడా ఆమె భర్త మృతి చెందినప్పుడు మాత్రమే పెరోల్‌పై బయటకు వచ్చారని, ఆ తర్వాత ఎప్పుడూ పెరోల్ కోరలేదని ఆమె తరపు న్యాయవాది రాజా సెందూర్ పాండియన్ తెలిపారు. దీనికి తోడు ప్రభుత్వ సెలవులు కూడా కలుపుకుంటే, ముందుగానే విడుదలయ్యే అవకాశాలు వున్నాయని అన్నారు, కాగా, మంత్రి బసవరాజ్ అందుకు భిన్నమైన ప్రకటన చేయడంతో ఆమె ముందస్తు విడుదలకు మరో మూడు నెలలు ఆగాల్సిందేనన్న వార్తలు వినబడుతున్నాయి, కావాలన్నది జైలు నిబంధనలే చెబుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది జనవరి 27 కంటే ముందు ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేనట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles