Crackers Association approches SC on HC ban బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలపై హైకోర్టు బ్యాన్..

Telangana crackers association challenges hc ban on fireworks in supreme court

Telangana Crackers Association, Supreme court, Diwali, high court, firecrackers, ban on sale of firecrackers, ban on bursting of fire crackers, Indra Prakash, Telangana High court, Telangana, crime

Challenging the High Court verdict regarding the ban on the sale and use of firecrackers in the state, the Telangana Crackers Association filed a petition in the Supreme Court on Friday. The petition will come up for hearing today. Meanwhile, the Telangana government has issued a GO banning sale of fireworks as per the High Court orders.

హైకోర్టు బ్యాన్ పై సుప్రీంను ఆశ్రయించిన బాణాసంచా అసోసియేషన్

Posted: 11/13/2020 02:27 PM IST
Telangana crackers association challenges hc ban on fireworks in supreme court

దీపావళి పండుగకు సరిగ్గా రెండు రోజుల ముందు రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు జారీ చేయడంతో దీనిపై తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ఇవాళ మధ్యహ్నం విచారణకు రానుంది. ఇదిలావుండగా, రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలను నిషేధిస్తూ జీవోను జారీ చేసింది. తాము రాష్ట్ర హైకోర్టు అదేశాలను ఫాలో అవుతున్నామని ప్రభుత్వం తెలుపకనే తెలిసింది.

రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్రోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో పాటు తమ అదేశాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో కరోనా ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితుల్లో బాణాసంచాను కాల్చడం సరైంది కాదని విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలను నిషేధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అలుముకున్న తరుణంలో బాణాసంచా పేలుళ్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలను జారీ చేసింది, కోవిడ్-19 కారణంగా కాలుష్యం పెరిగి కరోనా బాధితులపై తీవ్ర ప్రబావం చూపుతుందని పిటీషనర్ న్యాయవాది ఇంద్రప్రకాశ్ వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం పిటీషనర్ వాదనలతో ఏకీభవించింది. అంతరేముందు బాణాసంచా పేలుళ్ల నిషేదంపై ప్రభుత్వ వైఖరి ఏమిటని అడ్వోకేట్ జనరల్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా బాణాసంచా పేలుళ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ధిష్ట విధానాన్ని రూపోందించలేదని.. అయితే కరోనా నేపథ్యంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలు పాటిస్తూ.. అందుకు అనుగూణంగా ఆంక్షలు విధిస్తామని వివరించారు.

అయితే రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు అనేక మంది సంబంధిత అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నారని, ఇక అమ్మకాలు కోనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందులోనూ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రజలందరినీ అప్రమత్తం చేసి బాణాసంచా కోనుగోళ్లు చేసేందుకు సమయం కూడా సరిపోదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు, కాగా, బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచాపై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందనే అంశాలు, కారణాలతో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని నివేదిక రూపంలో ఈ నెల 19న అందించాలని అడ్వొకేట్‌ జనరల్ ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crackers Association  Supreme court  High Court  Firecrackers  Lawyer  Indra prakash  sales  telangana  crime  

Other Articles