Tiger kills tribal man in Asifabad ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డపై పెద్దపులి పంజా..

Tragedy in kumaram bheem asifabad tiger kills young tribal man

Vignesh, Tribal Youth, Social media, photos, videos, graze the cattle, Digida village, Dahegaon Mandal, Kumaram Bheem Asifabad, Telangana, Crime

In a horrifying incident, a tiger brutally attacked and killed a 21-year-old boy in Asifabad and created ripples panic among the tribals. According to the sources, Vignesh and along with his friends Bolishetti Naveen and Sidam Srikanth went to a forest area to graze the cattle on the outskirts of Digida village in Dahegaon Mandal. As per reports, a tiger attacked the tribal man and dragged him away.

ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డపై పెద్దపులి పంజా..

Posted: 11/12/2020 12:04 PM IST
Tragedy in kumaram bheem asifabad tiger kills young tribal man

మహారణ్యాలు మాయవవుతూ.. వన్యమృగాలకు తలదాచుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కనుమరుగు అవుతున్న నేపథ్యంలో క్రూరమృగాలు తమ అహారాన్ని అన్వేషిస్తూ జనారన్యంలోకి వస్తున్నాయి. దీంతో వాటికి కొంత చేరువలో వున్న అడవిబిడ్డలు ప్రాణాలను కొల్పోతున్నారు. తాజాగా కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మోహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం జరుగుతుందన్న విషయం గ్రామస్థుల నుంచి తెలిసుకుని.. దాని పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది అది ఎక్కడకు వెళ్లిందన్న అన్వేషణ సాగిస్తున్న క్రమంలో జిల్లా సరిహద్దులు దాటి అసిపాబాద్ జిల్లాలో అడవిబిడ్డ ప్రాణాలను బలితీసుకుంది.

జిల్లాలోని దహెగాం మండలం దిగిడలో దారుణం జరిగింది. ఓ పొలంలో పనిచేస్తున్న యువకుడిపై అక్కడే మాటువేసి ఉన్న ఓ పులి దాడిచేసి చంపేసింది. గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్ (22) తన స్నేహితులు శ్రీకాంత్, నవీన్ బోలిశెట్టిలతో కలిసి పత్తిచేను వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పొదలచాటున మాటువేసిన పులి విఘ్నేశ్ పై దాడిచేసి నోట కరచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. అనంతరం అతడిని చంపేసింది. పులి దాడితో భయంతో వణికిపోయిన శ్రీకాంత్, నవీన్ లు పరుగుపరుగున గ్రామంలోకి వెళ్లి విఘ్నేశ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి వచ్చి ఆ ప్రాంతంలో గాలించగా ఓ చోట విఘ్నేశ్ మృతదేహం లభ్యమైంది.

సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ప్రాథమిక విచారణన తరువాత పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. అడవిలోకి గొర్రెలను మేపేందుకు వెళ్లిన ముగ్గురికి అక్కడ పెద్దవులిని గమనించి.. దానిని దగ్గరగా ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఇలా వారు తమ చేతిలో వున్న మొబైల్ ఫోన్లతో దానిని బంధించే క్రమంలో అలికిడి విన్న పెద్దపులి వారిపైకి దాడి చేసింది. ఈ దాడిలో నవీన్, శ్రీకాంత్ లు తప్పించుకుని గ్రామంలోకి పరుగుపరుగున రాగా, విఘ్నేశ్ మాత్రం పులి పంజాకు చిక్కి బలయ్యాడు. వ్యన్యమృగాలు, క్రూరమృగాలను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో.. ఎవరికీ తెలియదని, అందుచేత అవి కనిపించినా వాటిని సెల్ ఫోన్లలో బంధించాలని ప్రయత్నించకుండా వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

(Video Source: ABN Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles