MP Dharmapuri Arvind fires on CM KCR, KTR ముఖ్యమంత్రి, మంత్రిపై విరుచుకుపడ్డ బీజేపీ యువ ఎంపీ

Nizamabad mp dharmapuri arvind lashes out at cm kcr ktr

Dharmapuri Arvind, D Arvind, Nizamabad MP, CM KCR, Minister KTR, KT RamaRao, GHMC Elections, Bollywood, Prime Minister, PM Modi, Telangana, Politics

Dharmapuri Arvind, D Arvind, Nizamabad MP, CM KCR, Minister KTR, KT RamaRao, GHMC Elections, Bollywood, Prime Minister, PM Modi, Telangana, Politics

ముఖ్యమంత్రి, మంత్రిపై విరుచుకుపడ్డ బీజేపీ యువ ఎంపీ

Posted: 11/09/2020 04:33 PM IST
Nizamabad mp dharmapuri arvind lashes out at cm kcr ktr

నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా అతని తనయుడు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. కుదిరితే ప్రగతి భవన్, లేదంటే ఫామ్ హౌజ్ ల నుంచి పాలన సాగించే ప్రభుత్వం ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తోందని ఆయన విమర్శించారు. గత అరేళ్లుగా ఇలాగే పరిపాలన సాఘిస్తున్న ముఖ్యమంత్రికి ఇక నయా సెక్రటేరియట్ భవనం ఎందుకన్న విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలరని ఆయన దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కన్నా అధికంగా జీతబెత్యాలు పోందుతున్న సొమరిపోతు ముఖ్యమంత్రి ఎవరన్నా వున్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు,

ఇలాంటి ముఖ్యమంత్రి హయంలో అధికారులు, రాష్ట్ర ఉద్యోగులు మాత్రం టంచనుగా టైముకి ఉద్యోగాలకు రావాలని ఎలా కోరుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న విషయం కూడా అర్థమవుతోందని ఇందుకు దుబ్బాక ఉపఎన్నికల పలితాలే అంకురార్పణగా నిలుస్తాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపి పతాకం రెపరెపలాడటం ఖాయమని చెప్పారు. కారు జోరుకు బ్రేకులు బీజేపి మాత్రమే వేయగలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

కేటీఆర్ మాటలు వింటుంటే హైదరాబాద్ ఎన్నికల విషయంలో భయపడుతున్నట్టు అర్థమవుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపి విజయదుఃధుభి మ్రోగిస్తోందన్న విషయం కేటీఆర్ కు అర్థమైందని అన్నారు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తామని అరవింద్ వెల్లడించారు. ఇక మంత్రి కేటీఆర్ కు కేంద్రం ఇచ్చిన నిధుల కంటే బాలీవుడ్ సంగతులే బాగా తెలుసని వ్యంగ్యం ప్రదర్శించారు. బాలీవుడ్ తో కేటీఆర్ కు గొడవ జరిగినట్టు సోషల్ మీడియాలో చదివానని వెల్లడించారు. అయినా ముఖ్యమంత్రి కుమారుడు కాకపోతే కేటీఆర్ ను పట్టించుకునేదెవరని అరవింద్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh