NDA Strength Crossed 100 Mark in Rajyasabha రాజ్యసభలో సెంచరీ కొట్టిన బీజేపి.. ఎన్నికల అస్త్రంగా మలచుకున్న మోడీ..

Not even 100 in two houses pm mocks congress s parliament tally

covid-19, coronavirus, PM Modi, Bihar election, Congress, Bihar Assembly Election, Bihar elections 2020, PM Modi Addresses Rally in Bihar, Pm Modi latest news, coronavirus updates

PM Narendra Modi, campaigning in Bihar today, mocked the Congress for not adding up to 100 members even in both houses of parliament combined.'Today the Congress is in such a state that if you combine the Lok Sabha and Rajya Sabha, even then they don't have 100 MPs,' PM Modi said at a rally in Forbesganj.

రాజ్యసభలో సెంచరీ కొట్టిన బీజేపి.. ఎన్నికల అస్త్రంగా మలచుకున్న మోడీ..

Posted: 11/03/2020 11:05 PM IST
Not even 100 in two houses pm mocks congress s parliament tally

(Image source from: Twitter.com/BJP4India)

రాజ్యసభలో బీజేపి బలం మరింతగా పెరిగింది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారిగా పెద్దల సభలోని తమ ఎంపీల సంఖ్యను సెంచరీ మార్కుకు చేర్చింది. తాజాగా, కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈ ఘనతను బీజేపీ సాధించగలిగింది. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశవ్యాప్తంగా తన బలాన్ని చాటుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయికి తన బలాన్ని కోల్పోయింది. ఓ వైపు బీజేపీ సెంచరీ మార్కు చేరిగా.. కాంగ్రెస్ మాత్రం తన బలం కుచించుకుపోతున్న విషయాన్ని గ్రహించలేకపోతోంది, ప్రస్తుతం 242 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్ బలం 38 మాత్రమే కావడం గమనార్హం.

అయితే బీహార్ ఎన్నికలలో తమకు కొంత ఎదురుగాలి వీస్తున్న తరుణంలోనూ అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మాలుచుకునే పార్టీలు దీనిని కూడా అస్త్రంగానే మలుచుకున్నాయి, బీజేపికి చెందిన కేంద్రమంత్రో లేక ఎంపీలో ఈ విషయాన్ని ప్రచారాస్త్రంగా మలిస్లే సరిపోయే విషయమే అయినా.. ఏకంగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీయే కాంగ్రెస్ బలం ఎంతగా తగ్గిపోతోందో అంటూ వ్యంగోక్తులు విసిరారు. పార్లమెంటులోని రాజ్యసభ, లోక్ సభలను కలిపినా కాంగ్రెస్ కు 100 మంది ఎంపీలు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంత ఘోరంగా ఉందని అన్నారు. ఏ విషయంపై చర్చించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని... అందుకే ఆ పార్టీ పార్లమెంటులో 100 కంటే దిగువకు పడిపోయిందని చెప్పారు.

ఇటీవల ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో 10 ఉత్తరప్రదేశ్, ఒకటి ఉత్తరాఖండ్ నుంచి ఉండగా, 9 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజ్యసభలో బీజేపీకి ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలైన ఆర్పీఐ, అసోం గణ పరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పట్టాలీ మక్కల్ కచ్చి, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీల మద్దతు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులున్నారు. రో నలుగురు నామినేటెడ్ సభ్యుల బలం కూడా కలుపుకుంటే, మొత్తం 104 మంది అధికారపక్షం వైపున్నట్టు. రాజ్యసభలో పూర్తి బలం చేకూరాలంటూ 121 మంది ఎంపీల సంఖ్య అవసరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles