ACB opposes MLA Sandra Venkata Veeraiah's discharge plea in scam case ఓటుకు నోటు కేసు: 4న సండ్ర, ఉదయసింహలపై అభియోగాలు నమోదు

Acb opposes mla sandra venkata veeraiahs discharge plea in scam case

ACB, sathupalli, Sandra Venkata Veeraiah, sandra veeraiah, mobile phones, MLC, MLA Veeraiah, Elvis Stephenson, uday simha, cash for vote, note for vote, Telangana, Politics

The call data retrieved from the mobile phones of Sathupalli MLA Sandra Venkata Veeraiah, Bishop Harry Sebastian, MP A Revanth Reddy and others drove the ACB towards making Sandra Veeraiah as an accused in the infamous vote-for-note scam, the conspiracy for which was hatched at TDP's Mahanadu in Hyderabad five years ago.

ఓటుకు నోటు కేసు: 4న సండ్ర, ఉదయసింహలపై అభియోగాలు నమోదు

Posted: 11/03/2020 01:49 AM IST
Acb opposes mla sandra venkata veeraiahs discharge plea in scam case

(Image source from: Oktelugu.com)

అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో తన పేరును బలవంతంగా ఇరికించారని, అసలు తనకు ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ఆయన దాఖలు చేసిన డిశ్చార్జీ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తనకు సంబందం లేని ఓటుకు నోటు కేసు నుంచి తన పేరును తోలగించాలని ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం కోట్టివేసింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఓటకు నోటు కేసు నుంచి తొలగించేందుకు ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. సండ్రతో పాటు మరో నిందితుడు ఉదయ్‌సింహ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

ఓటుకు నోటు కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని ఆయన తరపున ఆయన న్యాయవాది ఏసీబి న్యాయస్థానంలో వాదించారు. అయితే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహ, సెబెస్టియన్, లకు సంబంధించిన కాల్ డాటా, ఆదారాలన్నీ ఆయన కూడా ఓటుకు నోటు కేసులో నిందితుడని బలంగా చూపుతున్నాయని, ఈ క్రమంలో ఆయన పేరును ఈ కేసు నుంచి తొలగించవద్దని ఏసీబి తరపు న్యాయవాది బలంగా వాదించారు, ఈ కేసులో సండ్ర, ఉదయ్‌సింహ పాత్రలపై ఆధారాలున్నాయని ఏసీబీ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసింది. అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు ఓటుకు నోటు కేసు విచారణను 4కు వాయిదా వేసింది. కేసు విచారణకు ఇవాళ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ, సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles