Jaggareddy critisizes MInister Harish Rao sitairically పదవి కోసమే హరీష్ ఆరాటం.. మాకు ప్రజలే ముఖ్యం: జగ్గారెడ్డి

Congress mla jaggareddy critisizes minister harish rao sitairically

solipeta ramalinga reddy, Harish Rao, dubbaka assembly constituency, dubbaka by poll, jagga reddy, congress, ministry, TRS, state government, Telangana, Politics

Telangana Senior Congress Leader and Sangareddy MLA T JayaPrakash Reddy alias Jagga reddy critisizes Minister Harish Rao in Dubbaka Assembly constituency where by-poll elections are taking place. He also critisizes that Harish Rao is worried of his Minister post and Siddipet Ticket, but not the people of the state and dubbaka.

మంత్రి పదవి కోసమే హరీష్ రావు ఆరాటం.. కాంగ్రెస్ కు ప్రజలే ముఖ్యం: జగ్గారెడ్డి

Posted: 10/20/2020 10:03 AM IST
Congress mla jaggareddy critisizes minister harish rao sitairically

దుబ్బాక ఉపఎన్నికలలో తమ అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రి హరీశ్ రావు అపసోపాలు పడుతున్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మంత్రి హరీశ్ రావుపై విమర్శనాస్త్రాలు సంధించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే హరీశ్ రావు మంత్రి పదవి పోతుందని, ఎమ్మెల్యే సీటు కూడా ఉండదని తెలిసే ఆయనకు వణుకుపట్టుకుందని అన్నారు. ప్రస్తుతం హరీశ్ రావు ప్రయత్నమంతా తన మంత్రిపదవి, సిద్ధిపేట టికెట్ కాపాడుకునేందుకేనని వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికలలో తమ అభ్యర్థి విజయం కన్నా తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్ని అందోళన హరీశ్ రావులో ఎక్కువగా వుందని వ్యంగస్త్రాలు సందించారు.

దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక రాగా,. టీఆర్ఎస్ పార్టీ ఆయన సతీమణినే రంగంలోకి దింపగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడ్ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక బీజేపి తరపును పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు రంగంలో దిగారు. మూడు పార్టీల మధ్య త్రిముఖపోటీ నెలకొంది. కాగా, విజయం కోసం అన్ని పార్టీలు అహర్నిషలు శ్రమిస్తున్నాయి. దీంతో పాటు స్వతంత్రులు, పలు పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు విజయం కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వున్నారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో కొనసాగుతున్న ఎన్నికలలో అభ్యర్థులందరూ ఎన్నికల కమీషన్ జారీ చేసిన కరోనా నిబంధనలను పాటిస్తూనే ప్రచారం చేయాల్సివుంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ వేముల ఘాట్  గ్రామంలో ప్రసంగించారు. ఈ గ్రామం నుంచి తమ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించాలని ఆయన కోరారు. ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన చెరుకు ముత్యం రెడ్డి తనయుడికి మద్దతు పలకాలని కోరారు, ప్రజల సమస్యల గురించి నిలదీయాలంటే కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని అన్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాలకు న్యాయం జరగాలంటూ అది కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles