భారత దేశంలో ఎవరైనా జీవించవచ్చు అంటూనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ధర్మభూమిలో ఎవరైనా జీవించేందుకు హక్కు వుందని,, అయితే వారు తప్పకుండా హిందూ అధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. కర్మభూమిగా బాసిల్లుతున్న భారతదేశంలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ హిందీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ మతాలకు అతీతంగా ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి దేశాన్ని రక్షించుకుని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేతారని ప్రశంసించారు.
ఇక ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతగా ముస్లింలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని అన్నారు. పాకిస్థాన్ లో ఇతర మతాల వారికి హక్కులు ఉండవని అన్నారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్ సామ్రాజ్యాధిపతి అక్బర్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారని భగవత్ గుర్తుచేశారు. అయితే పలు ఇస్లామిక్ దేశాలలో మాత్రం అక్కడి ముస్లింలోని పలు వర్గాలకు మధ్య అగ్గిజ్వాలలు రగుతూనే వుంటాయని, వారిలో వారే అధిపత్యంపై పోరుతో హింసకు కూడా దిగుతున్న ఘటనలను మనం చూస్తున్నామని చెప్పారు.
కానీ భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని అన్నారు. అయితే, ఇకపై మాత్రం ఇక్కడ ఇతర మాతాల వారు జీవించాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, భారతదేశ స్వభావానికి అది ప్రతీక అని పేర్కొన్నారు. స్వాభివిక స్వభావాన్నే హిందూగా పిలుస్తారని భగవత్ అభివర్ణించారు. తమ స్వార్థ ప్రయోజనాలకు విఘాతం కలిగిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more