IPS officer held after 1200km long car chase ఆ ఐపీఎస్ అధికారి కోసం.. పోలీసుల 1200 కీ.మీల చేజ్..

Mumbai crime branch arrests fake ips officer after 1200km long car chase

Mumbai, Mumbai Crime branch, Fake IPS officer arrested, Shiv Shankar Sharma, Impersonator arrested in Mumbai, Extortion case, Blackmailing case, Surat businessman, Mohammed Ehtesham Aslam Naviwala, DRI, Garment export business, Mumbai Police, Crime

Mumbai crime branch officials have arrested a 38-year-old Rajasthan man who posed as an IPS officer and allegedly kidnapped a Surat businessman from a renowned hotel in Marine Drive and extorted Rs 16 lakh under the pretext of settling a complaint registered against the businessman in directorate of revenue intelligence (DRI), said officials.

ఆ ఐపీఎస్ అధికారి కోసం.. పోలీసుల 1200 కీ.మీల చేజ్..

Posted: 10/10/2020 12:30 PM IST
Mumbai crime branch arrests fake ips officer after 1200km long car chase

సినీపక్కీలో ఓ వ్యాపారవేత్తను సీనియర్ పోలీసు అధికారిలా బురడీ కొట్టించడంతో పాటు అతడ్ని కిడ్నాప్ చేసిన అక్రమంగా డబ్బులు లాగిన ఓ 38 ఏళ్ల నకిలీ ఐఏఎస్ అధికారిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. డైరెక్టరేట్ అప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లో నమోదైన ఓ కేసు విషయంలో రాజీ కుదర్చుకునే విషయమై వ్యాపారవేత్త అహ్వానం మేరకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలోని నాలుగు నక్షత్రాల హోటల్ లోకి వెళ్లి అతడి నుంచి రూ. 16 లక్షలను లాక్కున్నారు. ఇందుకోసం అతడ్ని గదిలో బంధించడంతో పాటు ఏకంగా గుజరాత్ కు గన్ పాయింట్ లో తరలించి డబ్బు చేతికందిన తరువాతే వ్యాపారవేత్తను వదిలిపెట్టారు.

డబ్బున్న పెద్దలను ఇలానే బురడీ కోట్టించి తన విలాసాలు, జల్సాల కోసం ఇష్టారీతిన డబ్బును వెచ్చించే కేటుగాడు.. సంపన్నులకు తాను ఓక సీనియర్ ఐపీఎస్ అధికారిగా బిల్డప్ ఇచ్చుకుంటాడు, అయితే ఈ నకిలీ అధికారి కోసం క్రైం బ్రాంచ్ పోలీసుల బృందం 24 గంటల వ్యవధిలో ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ నుంచి బెంగళూరుకు చేరకుని అక్కడ చాకచక్యంగా ఆటకట్టించారు. నిందితుడ్ని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అజ్మీర్ ప్రాంత వాసిగా గుర్తించారు. అతడి పేరు శివ శంకర్ శర్మ అని, అజ్మీర్ ప్రాంతంలోని బ్యావర్ ప్రాంత నివాసి అని తెలిపారు, సూరత్ కు చెందిన మహ్మద్ ఎహతేషం అస్తాం నవీవాలా అనే వ్యాపారవేత్తను వంచనతో మోసం చేసి డబ్బును దోచుకున్న నేపథ్యంలో పోలీసులు శివశంకర్ శర్మను అదుపులోకి తీసుకున్నారు,

క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారం రోజుల కిందట వ్యాపారవేత్త నవీవాలాకు నకిలీ ఐపీఎస్ అధికారి శర్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను సీనియర్ ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్న శర్మ.. నవీవాలా వ్యాపారంలో జరిపిన ఎగుమతులపై కస్టమ్స్ నిబంధనలను అతిక్రమించారని, ఈ మేరకు డైరెక్టరేట్ అప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లో కేసు నమోదు కాబడిందని చెప్పాడు, ఈ కేసును పరిష్కరించే విషయంతో తాను రాజీ కదుర్చుతానని చెప్పాడు. దీంతో నావీవాలా ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలోని ఖరీదైన నాలుగు నక్షత్రాల హోటల్ లోకి శర్మను ఆహ్వానించాడు. తన కిందిస్థాయి అధికారులుగా కొందరిన పేర్కోంటూ వారితో హోటల్ లోకి ప్రవేశించిన శర్మ.. నేరుగా విషయంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఇరువర్గాల మధ్య రాజీ కుదరలేదు. దీంతో నవీవాలను హోటల్ గదిలోనే బంధించి.. కొంత సేపటికి అతడ్ని గన్ పాయింట్ లో పెట్టి సూరత్ కు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత వారి చేతిలో డిమాండ్ చేసిన మేరకు రూ.16 లక్షలు పడిన తరువాతే అతడ్ని వదిలిపెట్టారు. దీంతో నవీవాల తనకు జరిగిన అవమానం, దాడి, మానసిక అందోళన విషయాలపై పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాలని తొలుత సూరత్, ఆ తరువాత ముంబై పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ముంబై క్రైంబ్రాంచ్ పోలీసుల బృందం ఈ కేసును సవాల్ గా తీసుకుని నిందితుడి కోసం రంగంలోకి దిగి సూరత్ కు వెళ్లింది. అయితే తరచూ ప్రాంతాలను మార్చుతూ తప్పించుకున్న నిందితుడు బెంగళూరుకు చేరకున్నాడని తెలుసుకున్నారు.

అంతే 24 గంటల వ్యవధిలో 1200 కిలోమీటర్ల దూరాన్ని కారులో చేజింగ్ చేసుకుంటూ వచ్చి పోలీసులు ఎట్టకేలకు బెంగళూరులో చాకచక్యంగా అరెస్టు చేశారు. అయితే శివశంకర్ శర్మ గతం కూడా ఘనమైన నేరచరిత్ర వుందని తెలుసుకున్న పోలీసులు.. గతంలోనే తాను పోలీసు అధికారిగా నమ్మబలికి మోసాలకు పాల్పడ్డాడని తెలిపారు. మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని పోలిసులు విచారణలో తేలింది. ఇక దీనికి తోడు ఓ మహిళా పోలీసుల అధికారిని కూడా వివాహం చేసుకుంటానని నమ్మబలికి.. అమె నుంచి భారీ మొత్తంలో డబ్బు దోచుకుని వెళ్లాడు. ఈజీగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలకు వినియోగించేవాడని పోలీసులు తెలిపారు.

శివశంకర్ శర్మకు ఓ కారు వుందని అందులో ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి యూనిఫాం సహా సర్వీస్ పిస్టల్ కవర్ కనిపించేలా ఏర్పాటు చేస్తాడని తెలిపారు. తాను పోలీసు శాఖలో ఎదుర్కోన్న అరోపణలు, మంత్రులు, రాజకీయ నేతల ఒత్తిడులను ఎలా ఎదర్కోన్న విషయాలను గోప్పగా చెప్పడంతో బాధితులు అతను నిజంగానే పోలీసు ఉన్నతాధికారి అని అంగీకరించేవారిని పోలీసులు తెలిపారు. దీంతో శివశంకర్ శర్మపై 170 (ప్రభుత్వ ఉద్యోగి వలె నటించడం), 120 బి (క్రిమినల్ కుట్ర), 323 (దాడికి పాల్పడటం), 342 (తప్పుడు నిర్బంధం), 364 ఎ ( డబ్బుకోసం అపహరించడం), 386 (ఒక వ్యక్తిని భయాందోళనకు గురిచేసి దోచుకోవడం), భారతీయ శిక్షాస్మృతి 504 (దుర్వినియోగం) మరియు 34 (సాధారణ ఉద్దేశం) మరియు ఆయుధ చట్టం 3 మరియు 25 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరపర్చనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles