Hathras Accused writes letter to SP, cites innocence హాత్రాస్ భాదిత కుటుంబానికి పోలీసు భద్రత.. సీసిటీవీల నిఘా..

Hathras case victims brother mother killed her claims main accused in letter to police

hathras gangrape case, Victim, Accused Sandeep, Accused Sandeep Ravi, Lav Kush Ramu, Sandeep letter, Uttar Pradesh Police, Victim Brother, Victim Mother, yogi adityanath, UP Police, SIT, Bajrang Dal, Karni Sena, RSS, BJP leader, former MLA, Rajveer Pahalwan, right wing groups, uma bharati, Uttar Pradesh, Politics, Crime

In an interesting development in the case of Hathras alleged gangrape and murder case, a copy of letter purportedly written by the main accused Sandip to the Superintendent of Police of Hathras came out on the social media on Thursday. In the letter, Sandeep wrote that he was innocent and the other three were also not involved in the matter.

హాత్రాస్ భాదితురాలి కుటుంబానికి భారీ పోలీసు భద్రత.. సీసికెమెరాల నిఘా..

Posted: 10/10/2020 10:03 AM IST
Hathras case victims brother mother killed her claims main accused in letter to police

దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందుతులకు మద్దతుగా బీజేపి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కూడా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు బాధిత కుటుంబంపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతిచెందిన బాధిత యువతిని పోలీసులు అఘమేఘాల మీద ఎందుకు దహనం చేశారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలకు పూనుకుంటున్నారు.

బాధితురాలి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు వారి ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు, ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ జిల్లాకు చెందిన బుల్గర్హి గ్రామంలోని బాధిత కుటుంబానికి భద్రతగా 60 మంది పోలీసులను ఏర్పాట్టు చేశారు, వీరిలో పలువురు మహిళా పోలీసులు కూడా వున్నారు. పోలీసుల కళ్లుగప్పి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలని చూసేవారి కోసం నిఘా నేత్రాలను కూడా ఏర్పాటు చేశారు. బాధితురాలి ఇంటి చుట్టూర.. పరిసర ప్రాంతాలను కవర్ చేస్తూ ఎనిమిది సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు ఏర్పాటు చేశామని తెలిపారు.

డీఐజీ షాలాభ్‌ మాథుర్‌ను లఖ్‌నవూ నుంచి హాథ్రస్‌కు నోడల్‌ అధికారిగా పంపారు. అవసరమైతే అక్కడ కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళా పోలీసులతో పాటు మొత్తం 60 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్టు హాథ్రస్‌ ఎస్పీ వినీత్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబం, సాక్షులకు పోలీసులు భద్రతగా షిఫ్ట్‌ల్లో పనిచేస్తారని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలతో ఆ ఇంటిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే, ఆ ఇంటి వద్దకు వచ్చేవారికి సంబంధించిన ఓ రిజిస్టర్‌ను కూడా పెట్టినట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles