Central Govt to lift off subsidy on Covid Testing Kits కరోనా టెస్టింగ్ కిట్లపై సబ్సీడీ ఎత్తివేయనున్న కేంద్రం.?

Central govt to lift off subsidy on coronavirus testing kits

Corona Virus, ICMR, Corona Tests, Meghalaya, Hotels, Guest Houses, Quarantine centres, Rapid Antigen Test, Trunad test, Food security card holders

Meghalaya spent Rs 399 crore to fight the COVID-19 pandemic, since March till September 30. Deputy Chief Minister Prestone Tynsong added that the State received an amount of Rs 48 crores from the Centre to fight the pandemic. 'The expenditure will be reflected in the annual report of the CAG,'

కరోనా టెస్టింగ్ కిట్లపై సబ్సీడీ ఎత్తివేయనున్న కేంద్రం.? రాష్ట్రాలపైనే భారం..

Posted: 10/08/2020 09:38 PM IST
Central govt to lift off subsidy on coronavirus testing kits

(Image source from: Newindianexpress.com)

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడితే ఇక మీ జేబుకు చిల్లే. కరోనా వైరస్ సోకిందని అనుమానాలను వ్యక్తం చేసిన ప్రతీ వ్యక్తి ఇక తమ జేబులోంచి డబ్బులు పెట్టుకుని పరీక్షల నుంచి వైద్యం వరకు అన్ని తానే భరించాల్సి వుంటుంది. అదేంటి ఎందుకిలా.. ఇన్నాళ్లు ప్రభుత్వాలు తమ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించాయి.. కరోనా అని తేలినవారికి వైద్యాన్ని కూడా ఉచితంగానే అందించాయి కాదా.. మరి ఇప్పుడెందుకిలా అంటారా.. ఇకపై కరోనా నిర్థారణ పరీక్షల నిమిత్తం అవసరమయ్యే టెస్టింగ్ కిట్ల వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇప్పటికే వ్యయభారాన్ని మోస్తున్న తమతో ఇకపై కరోనా భారం మోయలేమని రాష్ట్రాలు తెగేసి చెబుతున్నాయి.

కరోనా నిర్థారణ పరీక్షల కిట్లను రాష్ట్రాలు ఎందుకు భారంగా పరిగణిస్తున్నాయని అంటే.. లాక్ డౌన్ తో అన్ని రాష్ట్రాలు తమకు సాయం కావాలని కేంద్రంపైపు ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో అవసరాలను తీర్చుకునే విషయంలోనూ పలు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలు ఇస్తే ప్రజావసరాలు, జీతబెత్యాలు కూడా అందించాలని నిర్ణయించాయి. అయితే కేంద్రం ఆశించిన మేరకు తమకు రావాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో రాష్ట్రాల్లు ఇప్పటికే కేంద్రంపై గుర్రుగా వున్నాయి. ఇక ఈ క్రమంలో కరోనా టెస్టింగ్ కిట్లపై రాష్ట్రాలకు అందించే సబ్సీడిని కూడా కేంద్రం తాజాగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సీల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసీఎంఆర్) ఓ ప్రకటనలో పేర్కోంది.

దీంతో కేంద్రం నిర్ణయంపై రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అంతేకాదు కరోనా నిర్థారణ పరీక్షల భారం తాము భరించలేనిదని భావిస్తున్నాయి. ఇప్పటికే మేఘాలయా ప్రభుత్వం, ఈ నెల 16 నుంచి ప్రజలకు ఉచిత కరోనా టెస్ట్ లను చేయించలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ టిన్సాంగ్ స్వయంగా వెల్లడించారు. వచ్చే వారం నుంచి కరోనా పరీక్షలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి వుంటుందని ఆర్టీ-పీసీఆర్, సీబీ నాట్, ట్రూనాట్, రాపిడ్ యాంటీజెన్... ఇలా ఏ టెస్ట్ అయినా, రుసుము వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. నిర్ధారన అయిన రోగులకు ఉచిత భోజనాల సౌకర్యాన్నీ కూడా తొలగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మరిన్నీ క్వారంటైన్ కేంద్రాల కోసంగెస్ట్ హౌస్,  హోటళ్లలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. తాము తీసుకన్న నిర్ణయాలన్నీంటి నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని పేదలందరికీ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పేదలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరమని, వారు రూ. 500 చెల్లించాల్సి వుంటుందని, ట్రూనాట్ తదితర ఇతర పరీక్షలకు గరిష్ఠంగా రూ. 3,200 వసూలు చేస్తామని అన్నారు. కాగా, కొవిడ్ టెస్టులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించడంతో, పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles