(Image source from: Deccanherald.com)
కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుజనకోటి క్యూకడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులకు అందుబాటులోకి పలు సేవలను తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే గత నెల సెప్టెంబర్ 7 నుంచి డిజిటల్ కళ్యాణోత్సవం సేవను అందుబాటులోకి తీసుకురాగా, ఇక ఆన్ లాక్ 5.0 కూడా అమల్లోకి రావడంతో మరిన్నీ సేవలను కూడా భక్తజనకోటి అందుబాటులోకి తీసుకుంచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో గత శని, ఆదివారాల్లో కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తరుపతి కొండపై దేవదేవుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ పునరాలోచనలో పడింది.
ఒక్కసారిగా ఏకంగా 16 వేల మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనానికి కొండపైకి రావడంతో టీటీడీ తమ నిర్ణయాలను పునఃసమీక్షించుకుంది. డిజిటల్ శ్రీవారి కల్యాణం చేసిన భక్తులకు స్థుపధం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని, అయితే కళ్యాణం చేసిన భక్తులకు మూడు నెలల లోపు ఈ ఉచిత దర్శనాన్ని పొందాలని టీటీడీ వారికి బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలను పాటించాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో ఇక శ్రీవారి డిజిటల్ కల్యాణోత్సవం టికెట్లను కూడా పరిమితి కలిగిన సంఖ్యలోనే విక్రయించాలని నిర్ణయించారు. దీంతో గత నెలలో బంపర్ ఆఫర్ ప్రకటించిన టీటీడీ ఈ సారి పరిమితిని విధించింది.
కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా తిరుమల తిరుపతి దేవస్థానానినికి చేరుకుని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధికంగా వారాంతపు సెలవులు కలిగిన రోజులలోనే అధికంగా వస్తున్నారని గ్రహించిన టీటీడీ ఇకపై కల్యాణోత్సవం చేయించిన భక్తులు అధిక సంఖ్యలో రావడంపై పరిమితిని విధించింది. అందుకు వారి రాకను కాకుండా.. ప్రతీ రోజు కేవలం వెయ్యి శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. దీంతో కరోనా నిబంధనల మధ్యనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా టీటీడీ మార్గనిర్ధేశం చేయనుంది.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more