Magawa the minehunting rat sniffs out gold medal ఎలుకకు బ్రేవరీ అవార్డు.. బంగారు పతకం కూడా..!

Giant rat wins animal hero award for sniffing out landmines

magawa rat, magawa rat pdsa gold medal, pdsa gold medal, magawa rat pdsa winner, what is pdsa award, apopa magawa rat, British charity, United Kingdom

'Heroes come in all shapes and sizes,' reads an old quote and Magawa, the rat who has so far discovered 39 landmines and 28 items of unexploded ordnance was awarded the PDSA Gold Medal, which reportedly is the highest honour for outstanding animal bravery and exceptional dedication in civilian life.

ITEMVIDEOS: మూషికానికి బ్రేవరీ అవార్డు.. బంగారు పతకం కూడా.. ఎందుకంటే.!

Posted: 09/26/2020 09:34 PM IST
Giant rat wins animal hero award for sniffing out landmines

(Image source from: Apnews.com)

మూపికానికి బ్రేవరీ అవార్డును ప్రకటించడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా అందించారు. అదేంటి మూషికానికా.? బ్రేవరీ అవార్డా.? అంటూ అలోచనలో పడ్డారు. ఔనండీ.. నిజమే.. ఈ ఎలుక పోలీసు శాఖలో తన అత్యుత్తమ సేవలను అందించినందుకు గాను అవార్డును సాధించింది. పోలీసుల శాఖలో జాగిలాలు కదా సేవలను అందించేంది.. లేదంటే అశ్వాలు అందిస్తాయి. కానీ ఇదేంటీ మూషికం సేవలు అందించిందా.? అంటే ఔనన చెప్పక తప్పదు. ఆఫ్రికా ఖండములోని కాంబోడియాలో పోలీసుల విభాగంలో సేవలందించిన ఎలుకకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

కంబోడియా దేశంలో అక్కడి పోలీసులపై కుట్రలకు పాల్పడేందుకు దుండగులు సాహసిస్తూ నేలలో ల్యాండ్ మైన్లను పాతిపెట్టారు. అయితే విధ్వంసాలకు పాల్పడేందుకు ముష్కరులు పాతిపెట్టిన లాండ్ మైన్లను కనిపెట్టడంలో సహకరించినందుకు గాను ‘మగావా’ అనే ఆఫ్రికన్ ఎలుకకు బ్రేవరీ అవార్డు దక్కింది. ఈ అవార్డును అందించింది బ్రిటిష్ చారిటీ. ఈ పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. కానీ గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే కావడం విశేషం.

ఎలుక జాతికే ఆణిముత్యంలా నిలిచి చరిత్ర సృష్టించిన ఈ ఎలుక పేరు ‘మగావా’. ఆఫ్రికాకు చెందిన ఈ ఎలుక పోలీస్ జాగిలాల లాగా గొప్ప పని చేసింది. దుండగులు పాతిపెట్టిన లాండ్ మైన్లను కనిపెట్టడంలో ఈ ఎలుక అత్యంత ప్రతిభ కనబరిచింది. ఏడేళ్లలో ఏకంగా మగావా 39 ల్యాండ్‌మైన్లు, 28 పేలుడు పదార్థాలను కనిపెట్టింది. మనుషుల ప్రాణాలు కాపాడటంలో సేవలందించిన మగావాను బంగారు పతకంతో సత్కరించారు. మగావా ఎలుక వయసు ఇప్పుడు 7 ఏళ్లు. బెల్జియం దేశానికి చెందిన అపోపో చారిటీ సంస్థ ఎలుకలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 1990ల నుంచి ఈ సంస్థ ఎలుకలను ట్రైన్ చేస్తోంది.

(Video Source: PDSA)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PDSA Gold Medal  Rat  Bravery award  Cambodia  PDSA  Magawa  magawa rat  British charity  United Kingdom  

Other Articles