24-yr-old wins Rs 12-cr Onam lottery jackpot నిరుపేదను కోటీశ్వరుడ్ని చేసిన ఓనమ్ స్పెషల్ లాటరీ

24 yr old temple employee in kerala wins rs 12 cr onam lottery jackpot

Thiruvonam Bumper 2020, Kerala Onam lottery, kerala lottery,kerala lottery winner, kerala lottery result 2020, kerala lottery result, Ananthu Vijayan, Poor Family, Kerala Lottery, Onam, Jackpot, Temple employee, Covid 19 pandemic, Revenue, Ernakulam, Kerala

A 24-year-old man from in Idukki district, hit the jackpot as he won the first prize of the Kerala Government's Onam bumper lottery worth Rs 12 crore. Ananthu Vijayan, who is employed as a clerk in a temple in Ernakulam, brought the ticket TB 173964 from a lottery agent last month when the going was getting tough.

నిరుపేదను కోటీశ్వరుడ్ని చేసిన ఓనమ్ స్పెషల్ లాటరీ

Posted: 09/25/2020 04:09 PM IST
24 yr old temple employee in kerala wins rs 12 cr onam lottery jackpot

అదృష్టం ఉండాలే కానీ.. కొండలను కూడా బద్దలు కొట్టుకుని వచ్చి వరిస్తుందన్నది నానుడి. అదే నానుడి గత ఏడాది ఓ బంగారు నగల దుకాణంలో పనిచేస్తున్న నలుగురు మిత్రులను వరించగా, ఈ ఏడాది ఓ యువకుడిని వరించింది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాటరీలో గత కొన్నాళ్లుగా యువకులనే బంఫర్ ప్రైజ్ వరిస్తోంది. ఈ సారి కూడా కేరళ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన బంపర్ లాటరీలో అదృష్టం ఓ యువకుడినే వరించింది. ఆలయంలో సాధారణ ఉద్యోగలా జీవిస్తున్న యువకుడిని కోటీశ్వరుడిని చేసింది. యువకుడిలో బంగారు ఆశలను నిజం చేసేలా కొత్త సంవత్సరం నూతన శోభను తీసుకుంచ్చింది.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కికి చెందిన అనంతు విజయన్ అనే యువకుడిని ఈ ఏడాది ఓనం పర్వదినాన లక్ష్మీ కటాక్షం లభించింది. అదెలా అంటే లక్కీ లాటరీ రూపంలో వచ్చి అదృష్టం వరించింది. లక్ష్మీదేవి రూపంలో వచ్చిన అదృష్టంతో తాను సరస్వతీ కటాక్షాన్ని కూడా పోందాలని భావిస్తున్నాడు అనంతు విజయన్. ఇడుక్కికి చెందిన అనంత్ ఎర్నాకులంలోని ఓ ఆలయంలో పనిచేస్తున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ సారి ఓనం లాటరీ ద్వారా రూ.12కోట్లు గెలుచుకున్నాడు. ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకొని తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తామని యువకుడి తల్లిదండ్రులు తెలిపారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన ఎంబీఏ కలను సైతం అనంతు విజయన్ వదులుకున్నాడు. ఆలయంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. అతడి తండ్రి పెయింటర్‌ కాగా తల్లి ప్రైవేటు వస్ర్త దుకాణంలో పని చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి దీన పరిస్థితుల్లో లాటరీ తగలడంపై అనంత్‌ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. లాటరీ నగదుతో తమ కలలను నిజం చేసుకుంటామని సంబరపడుతోంది. అయితే డబ్బులోంచి కొంతభాగం తమలా కష్టపడుతున్న వారిని అదుకునేందుకు తీసిపెడతామని కూడా అనంతు విజయన్ కుటుంబసభ్యులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles