Tollywood actor Venugopal Kosuri passes away కరోనాతో మరో టాలీవుడ్ సినియర్ నటుడు మృతి

Tollywood actor venugopal kosuri passes away due to covid

Covid-19, Kosuri Venugopal, senior actor, Hearattack, Passes Away, Maryada Ramanna, Chalo, Pilla Jamindar, charecter artist, Coronavirus, corona positive, Gachibowli Hospital, Tollywood

Tollywood actor, Maryada Ramanna movie fame Kosuri Venugopal passed away on 23rd September due to Coronavirus. According to the reports, the actor was tested positive for Coronavirus and admitted to a private hospital in Gachibowli. He took his last breath while battling with the virus.

టాలీవుడ్ లో విషాదం.. కరోనాతో మరో సినియర్ నటుడు మృతి

Posted: 09/24/2020 03:04 PM IST
Tollywood actor venugopal kosuri passes away due to covid

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. వరుస ఘటనలతో పరిశ్రమకు చెందిన ప్రముఖులు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం పరిశ్రమలో అందోళన రేపుతోంది. ప్రతినాయకుడి పాత్రలతో పాటు కమేడియన్ గానూ రాణించిన జయప్రకాష్ రెడ్డి మరణంతో శోకసంధ్రంలో మునిగిన తెలుగుసినీ పరిశ్రమలో కోసూరి వేణుగోపాల్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన గత మూడు వారాలుగా గచ్చిబౌలిలోని ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పొందుతూ క్రితం రాత్రి పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆయన కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. మర్యాద రామన్న, పిల్లజమిందారు, చలో వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. తాజాగా అమీతుమీ సినిమాలో నటించారు. వేణుగోపాల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసిన టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవల మరో ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే.

కరోనా మహమ్మారిని తేలికపాటి వ్యాధి అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నా కేంద్రం కానీ, సోషల్ మీడియా నిర్వాహకులు కానీ వాటని పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ ఓ భయంకరమైన రోగమని ఇప్పటికే హాలివుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు దీని బారిన పడ్డి ప్రాణాలను కూడా కోల్పోయారన్న విషయాన్ని సినీపరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టికి తీసుకురావడం లేదు. కరోనాతో స్థంభించిన అన్ని రంగాల మాదిరిగానే సినీపరిశ్రమ కూడా కుదేలయ్యింది. దీంతో త్వరగా దానిని గాఢిలో పెట్టేందుకు ప్రభుత్వాలు, సినీపరిశ్రమలు యత్నిస్తున్నాయే తప్ప.. కోల్పోతున్న నటుల గురించి బాధ్యతగా వ్యవహరించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles