Corona Restrictions at sabarimala Ayyappa Temple శబరిమలకు వెళ్లే భక్తులూ.. ఈ విషయాలు తెలుసా.!

Travancore devaswom board restrictions at sabarimala temple ayyappa darshan to open from nov 16

Sabarimala temple, Sabarimala temple news, Sabarimala temple opening date, Sabarimala temple this year, Sabarimala temple restrictions, Sabarimala temple coronavirus, Sabarimala temple latest, Sabarimala temple november, Sabarimala temple Mandalam, Sabarimala temple Kerala government, Sabarimala temple no entry, Sabarimala temple for outsiders, Sabarimala temple 2020 news, Sabarimala Temple to Open from November 16th with Restrictions

The popular Sabarimala temple in Kerala will open its doors for the pilgrims on November 16th as the busy season starts in the month. The temple is all set to open the doors for the Mandalam-Makaravilakku season and there are restrictions for the pilgrims. The doctors recommended that people of the state will be allowed to visit the Sabarimala temple.

శబరిమలకు వెళ్లే భక్తులూ.. ఈ విషయాలు తెలుసా.!

Posted: 09/24/2020 03:07 AM IST
Travancore devaswom board restrictions at sabarimala temple ayyappa darshan to open from nov 16

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలల్లో భక్తులకు అనుమతి లేకుండా కేవలం అర్చక మహాశయులే మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి కూడా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహోత్సవాలు అనగానే పవిత్ర తిరుమాడ వీధుల్లో రోజుకో ప్రత్యేక వాహనం, పూటకో అంబారిపై విహరించే శ్రీవారు భక్తులకు అభయప్రధానం చేస్తూ ఊరేగుతుంటారు. ఇక తిరుమాడ వీధుల్లో ఇసుకేసినా రాలనంత భక్తజనం స్వామివారి ఊరేగింపును తనవితీరా తిలకిస్తుంటారు. ఈ ఉత్సవ వేడుకలు కన్నుల పండువగా సాగుతుంటాయి.

కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి చేందుతున్న నేపథ్యంలో దేశంలోని పలు ఆలయాల్లో దేవదేవతలకు ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, వేడుకలు అన్ని భక్తుల లేకుండానే జరుగుతున్నాయి. అన్ లాక్ నుంచి తెరుచుకున్న దేవాలయాల్లో ఇప్పటికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వకుండా కేవలం దర్శనభాగ్యం మాత్రమే కల్పిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు ఏడాది పోడుగునా తెరచి వుండే ఆలయాలకు మాత్రమే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు ఇవి పరిమితం అయ్యాయి, ఇదే తరహాలో ప్రసిద్ధ ఆలయం శబరిమలలోనూ భక్తలు దర్శనంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి, మలయాళ నూతన సంవత్సరం విస్సు సందర్బంగా ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మూసివేయబడిని శబరిమలలోని స్వామి ఆయ్యప్ప ఆలయం ఈ సారి మండల పూజ సందర్భంగా తెరవనున్నారు.

దీంతో మండల పూజ కోసం శబరిమల శ్రీ ఆయ్యప్ప దేవాలయం దర్శనానికి వచ్చే స్వాములను దృష్టిలో పెట్టుకుని అక్కడి ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు పలు అంక్షలను విధించింది. మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు శబరిమల సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదని దేవస్థానం బోర్డు పేర్కొంది. ఇక దీంతో పాటు శబరిమలకు వచ్చే భక్తులకు నీలకల్ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన రోగులను మాత్రమే రోజుకు ఐదు వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి పంపనున్నారు. స్వామివారి 18 బంగారు మెట్ల వద్ద ఈ సారి పోలీసులను సేవలు అందించరని తెలిపింది. తమ ఆంక్షలన్నింటినీ భక్తులు తప్పనిసరిగా ఆచరించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles