Sharad Pawar gets IT notice over poll affidavits ఎన్సీపి అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు

Sharad pawar stages one day fast to support suspended rajya sabha mps

Monsoon Session 2020, Parliament Monsoon Session, Parliament Session, Parliament Monsoon Session 2020, Rajya Sabha, Rajya Sabha Today, Sharad Pawar, MPs, Sharad Pawar, Harivansh singh, suspended MPs, Farm Bill, Rajya Sabha, Supriya Sule, maha vikas aghadi, lok sabha, aaditya thackeray, Maharashtra, Politics

Former Union agriculture minister Sharad Pawar criticised Rajya Sabha deputy chairman Harivansh for his conduct during the passage of two contentious farm bills on Sunday and said he is holding a day-long fast in solidarity with eight members of the House suspended for protesting against it.

ఆ ఎంపీలకు సంఘీభావం.. ఆ వెంటనే శరద్ పవార్ కు ఐటీ నోటీసులు

Posted: 09/23/2020 01:11 AM IST
Sharad pawar stages one day fast to support suspended rajya sabha mps

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కొందరిపై ప్రేమను కనబరుస్తూ మరికోందరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎన్సీపీ అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్‌ పవార్‌ అన్నారు. తమపై మాత్రం రంధ్రాన్వేషణ చేస్తూ కక్షపూరిత రాజకీయాలకు దిగుతోందని ఆయన పేర్కోన్నారు. ఇందులో భాగంగా తనకు కూడా కేంద్ర ఆదాయ పన్ను శాఖ తనకు కూడా నోటీసులు పంపిందని తెలిపారు. గతంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లపై కొన్ని వివరణలు కోరుతూ నిన్న ఈ నోటీసులు తనకు అందాయని విలేకర్లతో అన్నారు. మహారాష్ట్రలోని పలువురు బీజేపియేతర నేతలకు ఈ నోటీసులు అందాయన్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే, తన కుమార్తె ఎంపీ సుప్రియా సూలేకు సైతం ఆదాయపన్ను శాఖ ఇలాంటి నోటీసులను పంపిందని చెప్పారు. ఇక తాజాగా తనకు ఈ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందాయని తెలిపారు. ఎన్నికల సంఘానికి సంబంధించి ఇచ్చిన అఫిడవిట్ లకు సంబంధించి వివరణలు, ధ్రువీకరణలను కోరిందని.. వాటికి తాము సమాధానం చెబుతామన్నారు. వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకించే క్రమంలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీలకు సంఘీభావంగా మాజీ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఒక్కరోజు పాటు దీక్షకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles