VAT hiked by 10 percent on LPG Gas by AP Govt ప్రజలపై గ్యాస్ భారం మోపిన ఏపీ ప్రభుత్వం.. ధరల పెంపు..

Vat hiked by 10 percent on lpg gas by ap government

Lpg gas price, Lpg Gas, LPG Cylinder, Lpg subsidy cylinder, VAT hike, Value Added Tax, VAT on LPG, covid-19 crisis, andhra pradesh

Lpg prices in andhra pradesh increased once again as government has hiked vat from 14.5 percent to 24.5 percent in wake of covid 19 crisis.

ప్రజలపై గ్యాస్ భారం మోపిన ఏపీ ప్రభుత్వం.. ధరల పెంపు..

Posted: 09/13/2020 09:27 PM IST
Vat hiked by 10 percent on lpg gas by ap government

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కోనసాగుతున్న క్రమంలో ప్రభుత్వాలు పేద, బడుగు, బలహీన, మధ్యతరగతివారికి అండగా నిలబడి మేమున్నాం అని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే ప్రభుత్వాలు తాము ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసమే వున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నాయి. ఓ వైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా అటు పెట్రోల్, ఇటు డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలకు షాకిస్తోంది. మరీ ముఖ్యంగా డీజిల్ ధరల పెంపుతో నిత్యావరసర సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపి వాటి ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటున్నాయి. సరిగ్గా అన్ లాక్ 1 నుంచి పెరిగిన ఇంధన ధరలు పేద, బడుగు బలహీన వర్గాల నుంచి మద్యాదాయ వర్గాల వారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఇక ఇదే సమయంలో ఇటు రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ ధరలను పెంచుతూ నిర్ణయాలు తీసుకుని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని.. అందుకని ప్రజలపై భారం మోపక తప్పదని చెబుతున్న ప్రభుత్వాలు అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఆదాయాలు కోల్పయిన ప్రజలకు అండగా వుండాల్సిన ప్రభుత్వాలు.. ప్రజలను పక్కనబెట్టి ఆదాయ మార్గాలను అన్వేషించమేంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వాలు వున్నాయా.? లేక ఆదాయాల కోసం, రాబడుల కోసం ప్రభుత్వాలు వున్నాయా.? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలను లేవనెత్తుతూనే తమ దైనందిక జీవన గమనాన్ని సాగిస్తున్న ప్రజలపై మరో పిడుగు పడింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలు పెంచి షాక్ ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల పడిపోయిన రెవెన్యూను పెంచుకునేందుకు గ్యాస్‌ ధరలపై వ్యాట్ ను పెంచింది ఏపీ సర్కార్. ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధులు కొరత ఏర్పడనున్న తరుణంలో ఇప్పటికే ఇంధన ధరలపై వ్యాట్ పెంచిన సర్కార్ ఇక తాజాగా గ్యాస్ ధరలపై కూడా వ్యాట్ ధరలను పెంచింది. వంట గ్యాస్ పై ఇప్పటివరకు వున్న వ్యాట్ పన్నును 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచింది. ఇందుకు సంబంధించి ఆదేశం కూడా జారీ అయ్యింది. దీంతో గ్యాస్ ధరల ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తోందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రజలు ప్రభుత్వాన్ని గ్యాస్ ధర పెంపుపై అపార్థం చేసుకోకుండా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది.

ధర పెంపు చేపట్టిన విషయాన్ని ప్రభుత్వం తన ఆదేశంలో వివరణాత్మకంగా విశ్వేషించింది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆర్థిక వేత్తలు మొదట్నించీ చెబుతూనే వున్నారు. పథకాలను కొనసాగించడానికి పలు మార్గాల ద్వారా ప్రజల నుంచే ఆదాయన్నా రాబట్టాల్సి వుస్తుందని, దీంతో దీర్ఘకాలంలో సమస్యలు ఉత్పన్నం అవుతాయని కూడా చెప్పారు. ఇప్పుడదే పరిస్తితి ఏపీ సర్కార్ ఎదుర్కోంటోంది. ఇక కేంద్రం ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా జీఎస్టీని దేశంలో ఒక్క దేశం-ఒకే పన్ను విధానం అంటూ అన్నింటా అమలు చేసినా.. కేవలం ఇందనంపై మాత్రం దీనిని వర్తింపచేయకపోవడం తద్వారా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లను దాని పరిధిలోకి తీసుకురాకపోవడంతో వాహనదారులు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles