Telugu TV actress Sravani commits suicide ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్.. టీవి నటి శ్రావణి ఆత్మహత్య

Telugu tv actress sravani of manasu mamata fame dies by suicide

telugu tv actress dies by suicide, tv actress sravani kondapalli suicide, telugu tv actress, suicide, sravani kondapalli, Sravani, Osmania Hospital, mounaraagam, Manasu Mamatha, Devaraju Reddy, Blackmail, SR nagar police, Hyderabab, crime

Telugu TV actress Sravani Kondapally reportedly died by suicide on Tuesday (September 8) night. As per the latest reports, the actress was found hanging from the ceiling in the bathroom at her residence in Madhuranagar, Hyderabad. The body was later shifted to Osmania hospital for postmortem.

ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్.. టీవి నటి శ్రావణి ఆత్మహత్య

Posted: 09/09/2020 11:48 AM IST
Telugu tv actress sravani of manasu mamata fame dies by suicide

తెలుగు సినీపరిశ్రమను వరుస విషాధాలు ముంచెత్తుతున్నాయి. విలక్షణ క్యారెక్టర్ ఆర్టిస్టు, కమేడియన్, విలన్ జయప్రకాశ్ రెడ్డి గుండెపోటులో మరణించి 24 గంటలు కూడా గడవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి ఆత్మహత్యకు పాల్పడటంతో విషాదం అలుముకుంది. అయితే ప్రేమ పేరుతో అమెకు చేరువైన వ్యక్తి వేధింపులు భరించలేకే అమె ఆత్మహత్యకు పాల్పడిందని అమె తల్లిదండ్రులు అరోపిస్తున్నారు.

హైదరాబాదులోని మధురానగర్ లో నివసిస్తున్న శ్రావణి గత రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె  మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అమె తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగిపోయారు. అయితే శ్రావణికి కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడిందని అది కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసిందని అమె స్నేహితులు తెలిపారు. అయితే తనకు తల్లిదండ్రులు లేరని చెప్పి శ్రావణితో మరింత చనువు దేవరాజు రెడ్డి  పెంచుకున్నాడని చెప్పారు. ఇక అదే అదనుగా భావించిన దేవరాజు రెడ్డి.. తొలుత అప్పడప్పుడు  శ్రావణి వద్ద నుంచి డబ్బుల తీసుకునేవాడని, ఆ తరువాత నిత్యం వేధింపులకు గురిచేశాడని అమె కుటుంబ సభ్యులు తెలిపారు.

దేవరాజు రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అమె తల్లిదండ్రులు ఆరోపించారు. శ్రావణిని ప్రేమిస్తున్నట్టు నమ్మించిన దేవరాజు ఆమెతో కలసి సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకున్నాడని, ఆతర్వాత తాము ఏకాంతంగా వున్న ఫొటోలను అడ్డుపెట్టుకుని అమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. నిత్యం డబ్బుల కోసం వేధిస్తుండడంతో దేవరాజు రెడ్డి వేధింపులను భరించలేక శ్రావణి విపరీత నిర్ణయం తీసుకుందని అమె తల్లిదండ్రులు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఓ పర్యాయం అదే పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా వేధింపులు అగకపోవడంతో అమెఆత్మహత్య చేసుకుందని చెప్పారు. శ్రావణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన దేవరాజ్‌ను కఠినంగా శిక్షించాలని శ్రావణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles