హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలతో పాటు అటు కర్ణాటకలోని బెంగుళూరు సహా పలు నగరాలు, పట్టాణాల్లో వేగంగా విస్తరిస్తున్నలో ఆన్ లైన్ ఫార్మసీ స్టార్టప్ సంస్థ ‘‘మెట్రో మెడీ’’లో పెట్టుబడులు పెట్టేందుకు స్కైలైన్ వెంచర్స్ ముందుకువచ్చింది. హెల్త్ కేర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న సంస్థలో పెట్టుబడులను పెట్టేందుకు స్కైలైన్ సంస్థ ఒప్పందాలను కూడా చేసుకున్నట్లు సమాచారం. కాగా సంస్థలో 25శాతం మేర ఈక్వీటితో సంస్థను మరింత విస్తరించేందుకు కూడా స్కైలైన్ వెంచర్స్ సంస్థ ముందుకు వచ్చింది.
కంపెనీల వృద్ధి మూలధన అవసరాలను సులభతరం చేసి, వాటిని పెట్టుబడిదారులు, మర్చంట్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థతో అనుసంధానించే సంస్థగా ఇన్నాళ్లు సేవలందించిన స్కైలైన్ వెంచర్స్ ఇండియా, ఇకపై ఐటి, ఐటీఈఎస్ సేవలను కూడా విస్తరించనుంది. దీంతో పాటు మెడికల్, హెల్త్ సహా ఆర్థిక రంగాలలోని స్టార్టప్ సంస్థలలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా వున్నట్లు తెలిపింది. ఇలా పెట్టబుడులు పెట్టిన ప్రతీ సంస్థలోనూ స్కైలైన్ 25 శాతం ఈక్వీటీ హక్కు పొందుతున్నట్లు ఒప్పందాలు చేసుకుంటోంది. తద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకోంటోంది.
ఈ సందర్భంగా స్కైలైన్ వెంచర్స్ ఛైర్మన్ డి లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకలాపాలకు పెట్టుబడి బ్యాంకర్లను మరియు నిర్వహణ బృందాన్ని జోడిస్తూ విస్తరించేందకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నామో ఆ ఆశాజనకమైన స్టార్టప్ లను ఎంపిక చేశామని చెప్పారు. వాటిలోనే తాము ప్రారంభంలో బిజినెస్ ఎనేబుల్ లేదా డెవలపర్ గా స్టార్టప్ లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు, ఈ కంపెనీలలో పెట్టుబడుల యొక్క అవకాశాలను తాము పరిశీలిస్తామని చెప్పారు. వాటిలో నిధులు సమకూర్చడానికి ముందు, వారి వ్యాపార నమూనాను కనీసం ఒక సంవత్సరం దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు,
ఈ క్రమంలో అన్ లైన్ ఫార్మసీ సంస్థ మెట్రోమెడీతో పెట్టుబడులు పెడుతున్నామని దీంతో పాటు మొబైల్ అధారంగా స్వల్పకాలక రుణాలను అందిస్తున్న సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతున్నామన్నారు, డిజిటల్ ఫార్మాట్ల ద్వారా డిజిటల్ చెల్లింపులను చేస్తున్న జాగ్లే ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు, ఈ సంస్థతోనూ తాము ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు, ఫిన్ టెక్, హెల్త్ టెక్, మెడ్ టెక్ విభాగాలు తాము విస్తరించుకుంటున్నామని లక్ష్మీ నారాయణ తెలిపారు. స్కైలైన్ వెంచర్స్ ఎండి మధు మోహన్ అవలూర్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే అనేక టెక్ స్టార్టప్ లలో ఆదాయాన్ని సాధించామన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more