Sivani play with water during naming ceremony in temple నామకరణం రోజునే శివాణి అల్లరి.. నెట్టింట్లో వైరల్..

Baby elephant would rather play with water during naming ceremony in temple

Baby Elephant, naming ceremony, Mother Elephant Lakshmi, #Shivani, #SriVeerendraHeggade, Dharmadhikari, #Manjunatha_Swamy Temple, #Dharmasthala, South Karnataka

A Baby Elephant born on 1st July this year to Mother Elephant Lakshmi has been named as #Shivani by The Temple Head Dharmadhikari SriVeerendraHeggade, of Sri Manjunatha Swamy Temple, Dharmasthala of South Karnataka.

నామకరణం రోజునే శివాణి అల్లరి.. నెట్టింట్లో వైరల్..

Posted: 09/03/2020 09:22 PM IST
Baby elephant would rather play with water during naming ceremony in temple

పుట్టిన చిన్నారులు ఏం చేసినా ఎంతో అల్లరిగా వుంటుంది. అయితే ఈ అల్లరి మనుషుల్లోనే కాదు జంతువులైనా ఎంతో సంబరపడిపోతాం. ముద్దుముద్దు బుజ్జాయిలు చేసే అల్లరి ఎంతో ముద్దుగోలుపుతుంది. అయితే ఈ క్యూట్ బేబీస్ లో గజరాజు బల్లి ఏనుగు వుంటే అది ఎలా చేస్తోందో చూస్తే ఇక మురిసిపోవడం మన వంతు అవుతుంది. ఎందుకంటే ఏనుగులు కూడా చాలా బుద్ధిశాలి అంటారు. ఏనుగులు కూడా మనుషుల్లాగే వారి కుటుంబాలను, కుటుంబసభ్యులను చాలా ప్రేమిస్తాయి. ఇక వీటిని మన ఆధ్యాత్మికంగానూ వినాయకుడిగా భావిస్తాం. అందుకనే దేవాలయాల్లో జరిగే ప్రతీ వేడుకలకు ఏనుగు అంబారీలపై దేవుడిని ఊరేగించడం కూడా అనవాయితి.

ఇక కొందరు ఆవులను దేవాలయాలకు దానంగా ఇచ్చినట్టు మరికొందరు ధనవంతులు ఏనుగులను కూడా దానంగా ఇస్తారు. ఇలా దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థలక్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీ మంజునాధ స్వామి దేవాలయంలో వున్న ఏనుగల జంట గత జూలై మాసంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇటీవల ఓ శుభముహూర్తాన ఆ బుల్లి ఏనుగుగుకు దేవాలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్దంగా నామకరణం చేశారు. తల్లిదండ్రులతో వచ్చిన ఆ బుజ్జాయి ఆడబిడ్డ కాబట్టి దానికి అమ్మవారి పేరునే పెట్టి.. శివాణిగా నామకరణం పూర్తి చేశారు. అయితే నామకరణం పూర్తైన తరువాత అక్కడే వున్న రబ్బరు టబ్బులో నీళ్లు వుండగా దానితో అడుకుంటూ అల్లరి చేసింది.

ఇప్పుడీ బుల్లి ఏనుగుకు సంబంధించిన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శివాని నీటితో ఆడుతున్న దృశ్యాన్ని వీడియో తీసిన స్థానిక భక్తులు వాటిని సామాజిక మాద్యమాల్లో ఉంచారు. కాగా శివానికి నీటిలో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. తన అల్లరితో శివాణి ఏకంగా మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ను కూడా ఫిదా చేసింది. అంతేకాదు అనేక మంది నెట్ జనులు ఈ వీడియోలను షేర్ చేసుకుంటూ శివాణికి క్యూట్ అల్లరిని ఎంతగానో అస్వాధిస్తున్నారు, ఇక జైరాం రమేశ్ మాత్రం ‘‘వావ్‌.. ఎంత ముద్దుగా ఉందో, అల్లరి పిల్ల, సో క్యూట్ ‌..’’ అంటూ కామెంట్ చేశారు. ఇంకెదుకాలస్యం.. ఆ వీడియోలను మీరూ ఓ లుక్కేయ్యండీ.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles