Pranab Mukherjee political journey రాజకీయ చాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం సాగిందిలా..

Pranab mukherjee stalwart of indian politics political journey

pranab mukherjee death,Breaking news pranab mukherjee death,Pranab Mukherjee news,Pranab Mukherjee, Covid-19 positive,Former President Pranab Mukherjee death, Pranab Mukherjee,pranab mukherjee biography, what happened to pranab mukherjee,present president of india, pranab mukherjee twitter,pranab mukherjee death date

Pranab Mukherjee, former President of India and stalwart of Indian politics, was a good follower of former prime minister Indira Gandhi and was made as the first young finance minister of the country in Indira,s regime.

రాజకీయ చాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం సాగిందిలా..

Posted: 09/01/2020 12:11 AM IST
Pranab mukherjee stalwart of indian politics political journey

(Image source from: english.mathrubhumi.com)

భారత 13వ రాష్ట్రపతిగా దేశ ప్రజలందరికీ తెలిసిన ప్రణబ్ ముఖర్జీ.. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేతగా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా కూడా పేరొందారు. పార్టీలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయన తన రాజకీయ చతురతతో పరిష్కరించడంతో ఆయనకు ఇది అపాదించబడింది. అయితే ఇంతలా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఆయన ఆది నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగారా.? ఇందిరా గాంధీ సమయంలోనే కాంగ్రెస్ లో నెంబరు టు స్థానంలో కోనసాగిన ఆయన రాజీవ్ గాంధీ తరువాత పివీ నరసింహారావుకు పగ్గాలు ఎందుకు అప్పగించారు. ఆయన ప్రధానిగా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు.? అందుకు ఆయన సొంత పార్టీని స్థాపించడమే ఎసరు తెచ్చిందా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ఆ విషయానికి వస్తే ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందన్న విషయాలు ఒక సారి తెలుసుకుందాం..

* డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్ గా కెరీర్ ప్రారంభం

* 1963లో ఆయన విద్యానగర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా బాధ్యతలు

* బెంగాలీ పత్రిక ‘దెషర్‌ దక్‌’లో పాత్రికేయుడిగా విధులు

* 1969లో రాజకీయాంగా కీలక అడుగు.. కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు.. ఇందిరకు అత్యంత నమ్మకస్తుడిగా ముద్ర

* 1973లో కేంద్ర క్యాబినెట్ లో సహాయ మంత్రిగా పదవి

* 47 ఏళ్ల వయసులోనే 1982లో ఆయన దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలు

* ఇందిర మరణాంతరం వారసుడిగా రాజీవ్‌ గాంధీ పగ్గాలు చేపట్టడంతో.. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీ స్థాపన

* 1989లో కాంగ్రెస్ లో పునః చేరిక.. సొంత పార్టీని విలీనం

* 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి బాధ్యతలు

* 1995లో విదేశాంగ మంత్రిగా సేవలు

* 1998లో కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టేలా సోనియా గాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర

* 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలో తొలిసారిగా లోక్‌సభ నుంచి గెలుపు

* 2012 వరకూ ఆయన కీలకమైన విదేశీ, రక్షణ, ఆర్థిక శాఖల భాధ్యతలు

* 2012 నుంచి 2017 వరకూ ఆయన దేశ 13వ రాష్ట్రపతి బాధ్యతలు

* 2019 నాగ్ పుర్ లో జరిగిన ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరు

* 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు

* 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం

* 2019లో భారత రత్నతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం

కుటుంబ నేపథ్యం..

 

పశ్చిమ బెంగాల్ లోని మిరాట లో 1935 డిసెంబర్‌ 11న ప్రణబ్‌ జన్మించారు. ఆయన తండ్రి కె.కె.ముఖర్జీ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్‌ శాసన మండలిలో కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ప్రణబ్‌ పొలిటికల్‌ సైన్స్‌, చరిత్రలో మాస్టర్స్‌ పట్టాలను పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టాను సాధించారు. సువ్రా ముఖర్జీని  వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh