3 terrorists killed in encounter in Pulwama ఎన్ కౌంటర్లో మగ్గురు ఉగ్రవాదుల హతం..

Four terrorists killed in encounter in jammu and kashmirs pulwama

encounter, J-K encounter, Jammu And Kashmir encounter, Pulwama encounter, Judoora encounter, terrorists killed in encounter, pak terrorists encounter, jammu encounter, jammu kashmir encounter, J-K, Jammu And Kashmir, Pulwama, judhora, terrorists, Indian forces, Crime

The Jammu and Kashmir Police confirmed that three unidentified terrorists have been killed in an ongoing encounter with security forces in the judhoora area of Pulwama district.

జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. ఒక జవాను కూడా..

Posted: 08/29/2020 06:41 PM IST
Four terrorists killed in encounter in jammu and kashmirs pulwama

(Image source from: Twitter.com/ANI)

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి సదరు ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తరువాత కూడా అక్కడ ఉగ్రవాద ఆగడాలు సద్దుమణగడం లేదు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని షోపియాన్‌ జిల్లాలో ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను హతమార్చి 12 గంటలు కూడా తిరక్కముందే మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయే ప్రయత్నం చేశారు. అయితే భారత బధ్రతా బలగాలు ధీటైన సమాధానం ఇవ్వడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరితో పాటుగా ఎదురుకాల్పుల్లో ఒక భారత జవాను కూడా అమరుడయ్యాడు. దీంతో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇరువర్గాలకు మధ్య జరిగిన ఎదరుకాల్పుల్లో జదూర ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది.

పూల్వామా జిల్లాలో అక్రమంగా చోచ్చుకువచ్చిన ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు.. జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్భంధ తనిఖీలు చేపట్టారు, అనంతరం జిల్లాలోని జదూర ప్రాంతంలోనే వారు తలదాచుకన్నారన్న సమాచారంతో ఎక్కడికక్కడ నిర్బంధ తనిఖీలు చేస్తుండగా, వీరి కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు వారి నుంచి తప్పించుకునేందుకు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు హుటాహుటిన ఎదురుకాల్పులకు పాల్పడి ధీటైన సమాధానం చెప్పాయి. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఎదరుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

అర్థరాత్రి వేళ ఒక్కసారిగా కాల్పులు మోత వినిపించడంతో జదూర ప్రాంతంలో స్థానికులు భయకంపితులయ్యారు. కాగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు ఆక్కడికక్కడే మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులతో పోరులో ఒక జవాను కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. అయితే ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని అర్మీ వర్గాలు తెలిపాయి. కాగా ఇవాళ ఉదయం కూడా భారత బలగాలు సర్చ్ అపరేషన్ కోనసాగిస్తున్నాయని అధికారక వర్గాలు తెలిపాయి. దీనికి తోడు నిర్భంధ తనిఖీలను కూడా చేస్తున్నాయని పేర్కోన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : encounter  J-K  Shopian  Killora  terrorists  pak terrorists encounter  Indian forces  Jammu And Kashmir  Crime  

Other Articles