Decide on interest waiver during moratorium: SC మారటోరియంపై పన్నును మినహాయించలేరా.?: సుప్రీం

Dont hide behind rbi clarify your stand on loan moratorium sc to govt

reserve bank of india, rbi, loan moratorium, loan repayment, indian banks, bannk loans, loan default, coronavirus, lockdown, supreme court, Govt of India, Interest waiver, Central government

The Supreme Court lashed out at the Central government for not filing the affidavit in time with respect to the government’s decision on whether interest can be waived or, whether it can stop charging interest on interest accrued during moratorium period.

లాక్ డౌన్ ను విధించిన వాళ్లు.. పన్నును మినహాయించలేరా.?: సుప్రీంకోర్టు

Posted: 08/27/2020 01:56 PM IST
Dont hide behind rbi clarify your stand on loan moratorium sc to govt

లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల రుణాలపై ఈ అక్టోబర్ మాసం వరకు ఆర్బీఐ మారటోరియం విధించిన క్రమంలో వాటిపై వడ్డీ చెల్లింపు విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, మారటోరియం విధించిన భారతీయ రిజర్వు బ్యాంకును అడ్డుగా పెట్టుకుని వడ్డీల విషయాన్ని దాటవేయడం సరికాదని ఈ విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టంచేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించింది, ఆర్బీఐ పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దంటూ చురకలంటించింది. ఈఎంఐలు చెల్లించాలంటూ రుణగ్రస్తులపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఒత్తిడి చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఆర్బీఐ ని ఆదేశించింది.

ఆరు నెలల మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ, ఆ వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రంపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రం వద్ద అనేక అధికారాలు ఉన్నప్పటికీ.. ఆర్బీఐ సాకుతో తప్పించుకునేందుకు చూస్తోందని వ్యాఖ్యానించింది. ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం కొనసాగుతున్న సమయంలోనూ.. రుణం పోందిన సొమ్ముపై బ్యాంకులు, ఫైన్సాన్స్ సంస్థలు వడ్డీ బారాన్ని మోపుతున్నాయి, దీంతో అత్యున్నత న్యాయస్థానాన్ని కొందరు బాదితులు అశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ఇవాళ విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వమేనని... అందువల్ల మారటోరియం సమయంలో లోన్ రీపేమెంట్లకు సంబంధించి వడ్డీని చెల్లించకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని వ్యాఖ్యానించింది. ఆర్బీఐదే బాధ్యత అని తప్పించుకోవడం కుదరదని తెలిపింది. ఎప్పుడూ వ్యాపార ధోరణితోనే ఆలోచించొద్దని.. ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలంటూ మొట్టికాయలు వేసింది. మారటోరియం ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడాలని ఆదేశించింది. సెప్టెంబర్ 1లోగా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టాన్ని వినియోగించి రుణగ్రస్తులకు వడ్డీని మాఫి చేసే అవకాశం కూడా కేంద్రప్రభుత్వానికి వుందని సుప్రీంకోర్టు తెలిపింది. దానిని ఎందుకు వినియోగించరని ఈ సంరద్భంగా న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Loan moratorium  RBI  Govt of India  Interest waiver  Central government  

Other Articles