Vidadala rajani the leader next door for chilakaluripeta people 'పేట' ప్రగతికి లీడర్’లా పాటుపడుతున్న విడదల రజనీ

Peta mla vidadala rajini keen on constituency development and party growth

MLA Rajini Vidadala, Vidadala Rajini, Rajakka, chilakaluripeta MLA, YSRCP, TDP, CM YS Jagan, Rajini Vidadala Age, Rajini Vidadala Biography, Rajini Vidadala Caste, Rajini Vidadala Family, Rajini Vidadala Husband, Rajini Vidadala Twitter, Rajini Vidadala Photos, Rajini Vidadala Wiki, Vidadala Rajini Details, Vidadala Rajini Profile, ho is Vidadala Rajini, guntur, Andhra Pradesh, Politics

Chilakaluripeta MLA Vidadala Rajini is an young, enthusiastic and energetic Leader who always strugles for the development of the chilakaluripeta. The IT Engineer turned politician is a motivated and committed leader for people of her constituency, She is also an obedient and disciplaned leader within the party.

నియోజకవర్గ ప్రగతికి ‘లీడర్’లా పాటుపడుతున్న విడదల రజనీ

Posted: 08/26/2020 01:48 AM IST
Peta mla vidadala rajini keen on constituency development and party growth

పువ్వు పుట్టగానే పరిమళిస్తోందన్నట్టుగా.. రాజకీయాలలో అడుగుపెట్టగానే తన యువ నాయకత్వంతో నియోజకవర్గ ప్రగతికి పాటుతున్న ఎమ్మెల్యేలు ఎందరో. అయితే ఎమ్మెల్యేగా, నేతగా కాకుండా నాయకురాలిగా తన వారి కోసం.. తన ప్రాంత ప్రగతి కోసం.. తాను ఎన్నికైన పార్టీ కోసం.. అన్ని విధాలుగా శ్రమిస్తున్న నిజమైన లీడర్ విడదల రజిని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము అన్నట్లుగా తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టాను అందుకుని.. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఐటీ పరిశ్రమలో ఉన్నత ఉద్యోగం చేస్తూ.. చిలకలూరిపేట ప్రజల శాసనసభ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. అటు ప్రజల సమస్యలను తీరుస్తూ.. ఇటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. నిత్యం జనంలో వుంటూ.. అక్కడి యువతకు రాజక్కగా, పెద్దలకు రాజమ్మగా నిజానికి నాయకురాలిగా సేవలందిస్తున్నారు.

ఎన్నికలు పూర్తైన తరువాత ప్రజా రుణం తీర్చుకునే పనిలో భాగంగా ప్రజల ధన్యవాదాలు తెలిపే నేతలు.. ఆ తరువాత ఎక్కడకు వెళ్లారని జనం వెతికినా కనిపించరు. కానీ చిలకలూరిపేట నియోజకవర్గంలో అక్కడి ప్రజల పిలవకుండానే కనిపించి.. ఆప్యాయంగా పలకరించి.. సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. వాటికి పరిష్కారం చూపుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గోన్నా అక్కడికి సమీపంలోని ప్రజలతో మమ్మేకమై సమస్యలను తెలుసుకుంటూ.. ఎవరు సమస్యను ఎదుర్కోంటున్నా.. వారి చేరువకు చేరి మరీ పరిష్కారం చూపుతున్న నాయకురాలు రజిని. ఓ కార్యక్రమంలో పాల్గోన్న అమె అక్కడికి చేరిన మహిళామణులకు షేక్ హ్యాండ్ ఇవ్వగా, పాఠశాలలో చదివే చిన్నారి బాలుడు అమె చేయిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. అది ఆమెకు ఆ నియోజకవర్గంలో వున్న క్రేజ్.

చిన్ననాటి నుంచి చదువుల్లో నెంబర్ వన్ గా సాగి.. ఆట పాటల్లో, క్రీడా పోటీలలో ముందున్న రజిని.. అదే దూసుకెళ్లే స్వభావంతో ఐటీ ఇంజనీరుగా కూడా ఎదిగారు, అనతికాలంలోనే తాను పనిచేస్తున్న సంస్థలో నాయకత్వ పగ్గాలను అందుకున్నారు. అనంతరం అమె రాజకీయాలలోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా తన జోరును కోనసాగిస్తున్నారు. తన ప్రత్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావునే అమె ఢీ కొట్టి.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికలలోనే విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేగా అధికార యంత్రాంగాన్ని అదేశిస్తూనే తన వంతుగా నియోజకవర్గంలోని ప్రతీ యువతకు సామాజిక మాద్యమాల ద్వారా చేరువయ్యారు. ఎమ్మెల్యే అన్న పదమే కానీ.. అమెలో అధికారపు ఆడంబరాలు, హంగు ఆర్భాటాలు ఏ మాత్రం కనిపించవు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ పథకం తన నియోజకవర్గంలోని ప్రతీ అర్హులకు అందేలా తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేయాల్సిన పని అధికార యంత్రాంగానిదే అయినా.. అమె తనకు ఓటు వేసిన ప్రజలతో పాటు ఓటు వేయని అర్హులకు కూడా పథకాన్ని అందించేందుకు నిత్యం కృషి చేస్తుంటారు. ఈ మేరకు అమె అందుబాటులోకి అందివచ్చిన సామాజిక మాద్యమాలను కూడా విరివిగా వినియోగించుకుంటూ.. అటు యువత, ఇటు విద్యావంతులకు ప్రభుత్వ పథకాల వివరాలను వినూత్న రీతిలో తీసుకెళ్తుంటారు. ఇక ఎవరైనా తనను కలిసేందుకు యత్నించి విఫలం కాకుడదని అమె తన సొంతంగా ఓ వైబ్ సైట్ ను ఏర్పాటు చేసుకుని.. నియోజకవర్గ ప్రజలు తనను కలవకుండానే వారి సమస్యలను తన దృష్టికి వచ్చేలా.. దీంతో ఎవరి విలువైన సమయం వృధా కాకుండా ఏర్పాట్లు చేశారు. ఇలా నమోదైన సమస్యలను అమె ఒక్కోక్కటిగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కారిస్తూ వస్తున్నారు.

నియోజకవర్గంలో తన పార్టీ వారు అంటూ ప్రత్యేకంగా ఎవరికీ ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వకపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందరికీ లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. నా పార్టీ, నా పార్టీ కార్యకర్తలు, నా క్యాడర్, నా అనుయాయువులు అంటూ ప్రత్యేక కోటాను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ పథకాలు ఏవి వచ్చినా.. అవి తన పార్టీ వారికే దక్కేలా చర్యలు తీసుకునే పలువురు నేతలు వున్న ఈ రోజుల్లో తనకు ఓటు వేశారా.? లేక విపక్ష పార్టీ కార్యకర్త అన్న బేధభావం లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు చేరేలా అమె ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఇక తన నియోజకవర్గంలో ఎక్కడా, ఏ పథకంలోనూ అవినీతికి తావు లేకుండా నీతివంతంగా, నిజాయితీగా అర్హులైన లబ్దిదారులకు పథకాలు చేరేలా చేస్తున్నారు,

తనకు వర్గం అన్నది ముఖ్యం కాదని, తనకు తన నియోజకవర్గమే ముఖ్యమని విడదల రజినీ తేల్చి చెబుతున్నారు. అందులో భాగంగానే తన నియోజకవర్గంలో అభివృధ్ది శరవేగంగా పరుగులు పెట్టేలా చేస్తున్నారు. యువ నాయకురాలిగా అమెకు నియోజకవర్గంలో పెరుగుతున్న ఆదరణతో ఇప్పట్నించే అమె అంటే ప్రత్యర్థులకు గిట్టడం లేదు. అమె జోరు ఇలాగే కొనసాగితే.. మరో నాలుగేళ్ల తరువాత అమెను అందుకోవడం కలలోని మాటగా మారుతుందని ప్రత్యర్థులు ఇప్పట్నించే అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా ఎలాంటి అవినీతి, అక్రమానికి తావులేకుండా అమె పయనం సాగుతున్న నేపథ్యంలో అమెను ఇరుకునబెట్టేలా అమెకు పబ్లిసీటీ అంటే ఎక్కువ క్రేజ్ అని దిగజారుడు విమర్శలకు దిగుతున్నారు.

ఎమ్మెల్యే రజిని భర్త కుమారస్వామి ఓ వ్యాపార వేత్త.. అమె పబ్లిసిటీ కోసం ఆయన ఎంతైనా ఖర్చు చేయగలిగే సత్తా ఆయనకు వుంది. అయినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అమెకు పబ్లిసిటీ అంటే క్రేజ్ ఏమిటీ.? అయినా ఎన్నికలు ముగిసిన తరువాత ఈ పబ్లిసిటీ క్రేజ్ ఎందుకు.? ప్రజల్లో వుంటూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్న నేతకు మళ్లీ ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయించుకోవాల్సిన అవసరమేంటీ.? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నా.. కేవలం అమెను ఎలాగు నేరుగా ఎదుర్కునే అసమర్థులే ఇలాంటి చౌకబారు విమర్శలకు పాల్పడుతున్నారని అమె వర్గీయులు నేరుగానే కామెంట్ చేస్తున్నారు. ప్రజలకు పలు సందర్భాలలో అవసరమైయ్యే సహాయాలకు అమె తన సోంత డబ్బును కూడా వినియోగిస్తున్నా.. అమెపై ఈ విమర్శలేంటని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికలు ముగిసి ఏడాది సమయం కావస్తున్న తరుణంలో అమె చేసిన ఎన్నికల హామీలను నిలబెట్టకునే ప్రయత్నంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని పనులను కూడా చేపట్టి నియోజకవర్గ ప్రత్యర్థి క్యాడర్ చేత కూడా ఔరా అనిపించుకుంటున్నారు. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే అమె నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టారు. స్వతహాగా ఐటీ ఇంజనీరు.. అందులోనూ మంచి వ్యాపారవేత్తకు సతీమణిగా అమెకు ఎక్కడా.. ఏ పనిలోనూ ఎవరితోనూ లాలూచీ పడాల్సిన అవసరం లేకపోవడం.. అమెకు కలిసివచ్చే అంశం. ఇక రజనీ అంటే ఓ రాజకీయ వేత్త అని కాకుండా ఉత్తమ నాయకురాలు అనేలా ప్రజల చేత అనిపించుకోవాలన్నదే అమె ఆశయమని అలాంటి వ్యక్తిపై చౌకబారు విమర్శలు చేయడం హేయకరమని దుయ్యబట్టారు.

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కోనసాగుతున్న క్రమంలోనూ అమె నియోజకవర్గంలో పర్యటించి.. బాధితులకు అన్ని వసతుల కల్పన అందేలా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రులలో బాధితుకు ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగూణంగా మందులు, వేడి బోజనం, మంచాలు కల్పించాలని నియోజకవర్గం అధికారులకు అదేశించారు. ప్రతీ వారం సమీక్షలు నిర్వహించి కాంటాక్టు కేసులందరికీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో వున్న బాధితులకు వైద్య సేవలు సక్రమంగా అందేలా వైద్యాధికారులతో సమీక్షించారు. ఇక హోం ఐసోలేషన్ లో వున్న బాధితులకు ప్రభుత్వ నుంచే వైద్య సేవలు, మందులు అందేలా.. ఏ సమయంలో ఏం తీసుకోవాలి అన్న సూచనలను కూడా చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో దాదాపు 40,000 కుటుంబాలకు బియ్యం,కూరగాయలు,నిత్యావసరాలు పలు విడతలుగా సరఫరా చేశారు.

1. చిలకలూరిపేట నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల నిధులతో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే విడదల రజిని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమె మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా తమ నియోజకవర్గం అభివృద్దిలో శరవేగంగా పరుగులు పెడుతోందని చెప్పారు. గత పాలకులు మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తే.. తాను మాటలను కట్టిపెట్టి.. అభివృద్ధి చేతల్లో చేసి చూపుతున్నాని అన్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని చేర్చి నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చుతున్నామని అన్నారు. అందుకు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని చెప్పారు.

2. గతంలో ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన చిలకలూరిపేటకు  పల్నాడు వాటర్ గ్రిడ్ లో భాగం చేశామన్నారు. గత అనుభవాలతో అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రజల దాహర్తిపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేసి అటు సీఎం ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు వివరించానని తెలిపారు, అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఈ విషయాన్ని గుర్తు చేశానని.. ఫలితంగా వాటర్ గ్రిడ్ సాకారం అవుతోందన్నారు. ఈ పథకంలో భాగంగా చిలకలూరిపేటకు రూ.100 కోట్ల వరకు నిధులు కూడా విడుదలయ్యే అవకాశం వుందన్నారు. దీంతో చిలకలూరిపేట రూరల్ మండలం కట్టుబడివారిపాలెం, నాదెండ్ల మండలం సాతులూరు, యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామాల్లో భారీ వాటర్ ట్యాంకులు నిర్మిస్తారని అన్నారు. వాటర్ గ్రిడ్ పూర్తయితే గ్రామాల్లో మనిషికి రోజుకు వంద లీటర్ల చొప్పున, చిలకలూరిపేట మునిసిపాలిటీలో రోజుకు మనిషికి 135 లీటర్ల చొప్పున తాగునీటిని అందిస్తామన్నారు.

3. తాగునీటికి సంబంధించి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు, వాటర్ గ్రిడ్ కు సంబంధం ఉండదు. అమృత్ పథకం అలానే కొనసాగుతుంది. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న తాగునీటి ప్రాజెక్టులు సైతం అలానే కొనసాగుతాయి. అవి కాకుండా అదనంగా ఇంకా ఎంత మంచినీరు అవసరమవుతుందో ఆ మొత్తాన్ని గ్రిడ్ ద్వారా మన నియోజకవర్గానికి అందజేస్తారు. వాటర్ గ్రిడ్ కు అమృత్ పథకాన్ని అనుసంధానించేలా ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. ఇప్పటికే అమృత్ పథకానికి కావాల్సిన రూ.150 కోట్లలో రూ.83 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. అతి తర్వలోనే ఈ నిధులు కూడా విడుదలవుతాయి. ఈ ఏప్రిల్ నుంచే అమృత్ పథకం ఫలాలు పేట ప్రజలకు దక్కబోతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాదిలో అమృత్ పథకాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రారంభిస్తాం.

4. రూ.30కోట్ల నిధులతో చిలకలూరిపేట నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. ఈ ఏడాది తాత్కాలికంగా చుండి రంగనాయకులు కళాశాలలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. రూ.30 కోట్ల నిధులతో శాశ్వత భవనాల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. నాదెండ్ల మండలం ఇర్లపాడు పంచాయతీ పరిధిలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించబోతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు ఒక దశలో అందకుండా పోతుందేమోనని ఆందోళన చెందాం. కానీ అధికారుల వెంటపడి మరీ ఈ ప్రాజెక్టు మంజూరయ్యేలా, ఈ ఏడాదే తరగతులు కూడా ప్రారంభమయ్యేలా చేశాం. నేను ఎమ్మెల్యేగా సాధించిన గొప్ప కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి.

5. రూ.22 కోట్లతో మన నియోజకవర్గానికి ముస్లిం మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయించానన్నారు. తాతపూడి రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలంలో పాఠశాల నిర్మాణం చేపడతామన్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో రాకపోకలకు అనువుగా వుంటుందని భావించామన్నారు, ఇందుకు సంబంధించిన ఫైలు కూడా సిద్ధంగా ఉందన్నారు. ఈ పాఠశాలలో ఏటా 600 మంది వరకు ముస్లిం బాలికలు విద్యను అభ్యసించే వీలు ఏర్పడుతుంది. ఉచిత విద్యతో పాటు, వసతి, భోజన సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది.

6. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు వంద శాతం పూర్తవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఇప్పటికే  ఆ దిశగా ముందడగు వేశాం. నియోజకవర్గం మొత్తం మీద గ్రామాల్లో వంద శాతం సీసీ రోడ్ల నిర్మాణం కోసం తొలివిడతలో రూ.15.03 కోట్లు, రెండో విడతలో రూ.14 కోట్లు, తాజాగా మూడో విడతలో రూ.46.6 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులూ ప్రారంభమయ్యాయి. ఈ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వంద శాతం నిర్మించబోతున్నామని తెలిపారు

7. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం కోసం రూ.25కోట్లు మంజూరయ్యాయి. పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

8. పట్టణాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న ఓగేరు వాగు మీదుగా వంతెన నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు.

9. చిలకలూరిపేట పట్ణణంలో ఆటోనగర్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నానన్నారు. ఇందుకోసం ఏపీఐఐసీకి భూమిని అప్పగించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం సంబంధిత ఫైలు సీసీఎస్ విభాగంలో ఉంది. త్వరలోనే సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు ఈ ఆటోనగర్లో చేపట్టడానికి కృషి చేస్తున్నాం.

10. యడ్లపాడు మండలం వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను. రోడ్డు సమస్య తీర్చడంతోపాటు, పెద్ద కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు పెట్టుబడిపెట్టేలా కృషి చేస్తున్నానన్నారు.

11. పసుమర్రు గ్రామ దాహార్తి తీర్చేందుకు రూ.4 కోట్లతో నిధులు నిలిచిపోతే.. వాటిని మళ్లీ మంజూరు చేయించానన్నారు. మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తి కాబోతున్నాయి.

12. చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణానికి కట్టుబడి వున్నామని.. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చివరి దశలో ఉందని అన్నారు. సుమారు రూ.600 కోట్ల నిధులతో 16.3 కిలోమీటర్ల మేర, అత్యాధునికంగా, అన్ని హంగులతో ఈ రహదారిని నిర్మించబోతున్నామని తెలిపారు.

13. చిలకలూరిపేట పట్టణానికి రూ.12కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారింభించబోతున్నాం. వచ్చే పది రోజుల్లో పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.

14. చిలకలూరిపేట పట్ణణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం మొత్తం రూ.30 కోట్ల నిధులు అవసరమని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, నిధుల మంజూరులో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు.

15. చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట గ్రామంలో రూ.5 కోట్ల నిధులతో నిర్మాణంలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాల భవనం పూర్తి ధశకు చేరిందని దీనిని వచ్చే విద్యాసంవత్సరానికి ప్రారంభిస్తామన్నారు.

16. నాదెండ్ల మండలం కనపర్తి గ్రామానికి వెళ్లే దారిలో రూ.3 కోట్ల నిర్మాణంతో చేపట్టిన వంతెనను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

17. చిలకలూరిపేట పట్టణంలో రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని రెండు నెలల్లో ప్రారంభించబోతున్నామన్నారు.

18. యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం కూడా 40 శాతం పూర్తైందని అన్నారు. నిధుల సమస్య తలెత్తకుండా త్వరలోనూ పూర్తిచేసి.. వచ్చే ఏడాదికి ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నామని అన్నారు.

19. చిలకలూరిపేట నియోజకవర్గానికి చిరకాల స్వప్నమైన ఈఎస్ ఐ ఆస్పత్రి ని ఎట్టకేలకు ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే సాధించాం. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో ఈఎస్ ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు.

20. కొండవీడు అభివృద్ధి కోసం కంకణబద్దురాలినై వున్న తన పట్టుదలకు ఫలితంగా రూ.11 కోట్లతో ఘాట్ రోడ్డు రెండో దశ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. విద్యుత్ సబ్ స్టేషన్ కూడా మంజూరైందని తెలిపారు. స్థలం సేకరణ జరుగుతోందన్నారు, దీంతో కొండవీడు విద్యుద్దీకరణ సాధ్యమవుతుంది. కొండపై బురుజుల నిర్మాణం, చెరువుల ఆధునికీకరణ, చిన్నపిల్లల పార్కు, ఆలయాల పునరుద్ధరణ, పార్కింగ్ ఏరియా తదితరాల అభివృద్ధి వచ్చే ఏడాదిలోగానే పూర్తికానున్నాయని తెలిపారు. కొండవీడు సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాన్ని రూ.100 కోట్లు మంజూరు చేయాలని తాను కోరానని తెలిపారు. బోయపాలెం- కొండవీడు రహదారిని నాలుగువరుసలుగా విస్తరించబోతున్నామని తెలిపారు.

ఇవి కాకుండానే రానున్న నాలుగేళ్ల హయాంలో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పథంలో పయనింపజేస్తానని విడదల రజిని తెలిపారు. నాదెండ్ల, చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లాల‌ను క‌లుపుతూ కొత్త‌గా ఒక తారు రోడ్డు నిర్మాణానికి రూ. 9.1కోట్లు మంజూర‌య్యాయి. పీఎంజీఎస్‌వై ప‌థ‌కం కింద మంజూరైన రోడ్డును నాదెండ్ల‌, అప్పాపురం, లింగంగుంట్ల‌, పోత‌వ‌రం గ్రామాల మీదుగా నిర్మించ‌నున్నాం. దాదాపు 13 కిలోమీట‌ర్ల రోడ్డు నిర్మాణానికి త్వ‌ర‌లోనే టెండ‌ర్లు కూడా పిల‌వ‌బోతున్నామని తెలిపారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రజాప్రతినిదులు చేసిన అభివృద్ది ఎంత.. తాను చేస్తున్నది ఎంత అన్నదాన్ని బేరిజు వేసుకోవాలని అమె ప్రజలకు సూచించారు. ఇక తమ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేక అభివృద్ది పనులను కూడా చేపడుతున్నారని అక్కడి ప్రజలు కితాబిస్తున్నారు. అయితే ఒక్క ఏడాదిలోనే ఇలా వుంటే.. ఐదేళ్ల నాటికి ఎలా వుంటుందోనని కూడా స్థానికులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles