All Licensees Allowed To Home Deliver Medicines ఆన్ లైన్, హోం డెలివరీ మందులకు మార్గదర్శకాల జారీ..

All licensees allowed to deliver medicines at home since march

e-pharmacy, medicines home delivery, Health ministry, Delhi, door step delivery, sheduled drug H, prolonged illness medicine, indian drug delivery license

Amid the controversy over online delivery of medicines, it has emerged that the Union Health Ministry had given explicit approval for doorstep delivery of drugs through email since March. This was done through a notification by the Health Ministry on March 26. It implies that all Indian licenses are permitted to deliver at home and e-pharma is essentially nomenclature.

ఆన్ లైన్, హోం డెలివరీ మందులకు మార్గదర్శకాల జారీ..

Posted: 08/22/2020 12:39 AM IST
All licensees allowed to deliver medicines at home since march

సమాజంపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దేశంలో ఆన్‌లైన్‌ మందుల సరఫరాకు నానాటికి డిమాండ్ పెరుగుతోంది. వాణిజ్య దిగ్గజాలు అమెజాన్‌, రిలయన్స్‌ కూడా ఆన్‌లైన్‌ ఫార్మా రంగంలోకి అడుగుపెట్టడం ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఔషధాల ఆన్‌లైన్‌ సరఫరా, నిబంధనల గురించి వివిధ సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారి ఇంటి వద్దకే ఔషధాల సరఫరా చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అయితే ఈ విషయంలో నియంత్రణ ఉండటం అవసరం అని తెలిపింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి...

* లైసెన్సు గల ఫార్మా సంస్థలు ఔషధాలను వినియోగదారుల ఇళ్లకు అందచేయవచ్చు.

* లైసెన్సు గల ఫార్మా సంస్థలు మాత్రమే షెడ్యూల్‌ హెచ్‌ వర్గానికి చెందిన మందులను అందించాలి.

* ఫార్మా అమ్మకందారులు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ సేకరించిన తరువాతే అమ్మకాలు జరపాలి. 

* ప్రిస్కిప్షన్‌లు స్వీకరణకు వినియోగించే ఇ మెయిల్‌ ఐడీని అధికారికంగా రిజిస్టర్‌ చేసుకోవాలి.

* అమ్మకందారులు తమ రెవెన్యూ పరిధికి చెందిన ప్రాంతాలకు మాత్రమే మందులను సరఫరా చేయాలి.

* దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యులు ప్రిస్క్రిప్షన్ తేదీ నుంచి 30 రోజుల మందులను మాత్రమే సరఫరా చేయాలి.

* ప్రమాదకర వ్యాధులకు  ప్రిస్క్రిప్షన్ తేదీ నుంచి వారం రోజులకు మాత్రమే ఔషధాలు అందించాలి.

* ఆన్ లైన్‌ మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లును రిజిస్టర్డ్‌ ఈ మెయిల్‌ ద్వారా వినియోగదారులకు పంపాల్సి ఉంటుంది.

* ఆన్ లైన్‌ ఔషధాలకు సంబంధించిన వివరాలను, బిల్లులను, రికార్డులను విక్రేతలు భద్రపరచాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles