9 Trapped After Fire At Hydroelectric Plant In Telangana శ్రీశైలం పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం

Fire at srisailam hydroelectric plant in telangana 9 trapped

Telangana, Telangana fire, Telangana dam power station fire, Srisailam dam fire, Srisailam dam, Srisailam Power Station, Srisailam Power Station fire

A major fire broke out in an underground hydroelectric power unit of at Srisailam project in Telangana on Thursday night. The incident took place around 10.30 pm on Thursday. At least 25 people were on duty at the time when fire broke out at the power station. As per latest updates, 10 have been rescued while eight are still missing.

శ్రీశైలం పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం

Posted: 08/21/2020 03:04 PM IST
Fire at srisailam hydroelectric plant in telangana 9 trapped

శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో తొలుత ప్యానల్‌ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విస్పోటనం సంభవించింది. భారీ శబ్దాలు వినిపించడంతో భయాందోళనకు గురైన సిబ్బంది ఏంటా అని అరా తీసే లోపు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు ఎక్కడి నుంచి వస్తుందో అని పరిశీలనకు వెళ్లిన తొమ్మది మంది సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.

కాగా పోగ వ్యాప్తిని గమనించిన డీఈ పవన్ కుమార్ సహా పవర్ ప్లాంట్ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్‌ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడ్డారు. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు. అయితే ప్రమాదంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలకు ధట్టమైన పోగలు అవరోధంగా నిలిచాయి, అప్పటికీ అధికారులు అప్రమత్తమై ప్లాంటులో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. తెల్లవారుజాముకు మంటలు అదుపులోకి వచ్చాక మరోమరు అధికారులు లోపల చిక్కుకుపోయిన సిబ్బంది కోసం ప్రయత్నాలు చక్కబెట్టినా దట్టంగా అలుముకున్న పొగతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, కలెక్టర్‌ శర్వన్‌, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభార్‌ రావు, టీఎస్‌ జెన్‌కో సీఈ రమేష్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పరిశీలించారు. జల విద్యుత్‌ కేంద్రంలో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అగ్నిప్రమాదంలో గాయపడిన డీఈ పవన్‌ కుమార్‌, ప్లాంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, డ్రైవర్‌ పాలంకయ్య, మాతృ, కృష్ణారెడ్డి, వెంకటయ్య ఈటలపెంట జెన్‌కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles