Russia got COVID vaccine while India got Bhabhiji Papad: Shiv Sena మాటలే తప్ప సాధించిందేమిటని కేంద్రానికి ప్రశ్న..

Pm shared stage with ram temple mahant will he quarantine himself asks raut

COVID19, Coronavirus, Shiv Sena, COVID vaccine, COVID cure, Sanjay Raut, Bhabhiji Papad, Self Quarantine, PM Modi, Mohan Bhagwat, Nrutyagopal das, politics

The Shiv Sena has praised Russia for developing the first vaccine against COVID-19, while it criticised the BJP-led government and its ministers for promoting Bhabhiji Papad to cure infected patients. Shiv Sena MP Sanjay Raut also raised doubts regarding quarantining of PM Modi and Mohan Bhagwat after Nrutyagopal Das got infected with COVID-19.

రష్యాపై ‘సేన’ ప్రశంస.. మాటలే తప్ప సాధించిందేమిటని కేంద్రానికి ప్రశ్న..

Posted: 08/18/2020 01:51 AM IST
Pm shared stage with ram temple mahant will he quarantine himself asks raut

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ను రూపొందించిన రష్యాను మహారాష్ట్ర అధికారిక పార్టీ శివసేన కొనియాడింది. కరోనాను తుదముట్టించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రపంచంలోనే తొలి వ్యాక్సీన్ ను సిద్దం చేసిన ఘనత సాధించడం ద్వారా రష్యా స్వావలంబన చాటుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. అయితే అదే సమయంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపిపై మాత్రం విమర్శలను సంధించారు. రష్యా కరోనాను కట్టడి చేసేందుకు వాక్సీన్ ను తయారు చేయగా, కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు మాత్రం కరోనా కట్టడి కోసం బాబీజీ పాపడ్లను ప్రచారం చేస్తున్నారని వ్యంగ వ్యాఖ్యలు చేశారు.

మన దేశంలో అధికారంలో వున్న బీజేపి ఆత్మనిర్భర్ అంటూ గొప్ప మాటలు చెప్పడం తప్ప.. కరోనా కాటుకు గురై పోతున్న ప్రాణాలను నియంత్రించేందుకు ఇప్పటివరకు సాధించిందేమీ లేదని విమర్శించారు. రష్యా వ్యాక్సిన్ ఏమాత్రం నమ్మదగింది కాదని ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమైతే, తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ డోసు ఇచ్చి దేశంలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కొనియాడారు. ప్రస్తుతం దేశానికి రష్యా లాంటి నాయకత్వం కావాలని అంతటి బలమైన పాలనాయంత్రాంగం కావాలని ఆయన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ద్వారా అభిప్రాయాలు వ్యక్తపర్చారు. ఆయుష్ మంత్రిత్వశాఖ మంత్రి శ్రీపాద నాయక్ అయుర్వేద ఔషదాలను, విధానాలను ప్రచారం చేస్తూ కరోనా ప్రభావానికి గురైన విషయాన్ని కూడా ఆయన సామ్నాలో ప్రస్తావించారు.

రష్యా తయారు చేసిన వాక్సీన్ ను అక్కడ కాకుండా అమెరికా లాంటి దేశాల్లో అభివృద్ది చేసి వుంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఏ వ్యవస్థ అయినా ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేసేవారా.? అని ఆయన ప్రశ్నించారుజ ఆత్మనిర్భర్ అంటే ఏమిటో రష్యా ప్రపంచానికి తొలిపాఠం నేర్పిందని పేర్కొన్నారు. మనం మాత్రం ఆత్మనిర్భర్ గురించి ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం అంటూ మండిపడ్డారు. అంతేకాదు, అయోధ్య రామమందిరం ట్రస్ట్ అధినేత మహంత్ నృత్యగోపాల్ దాస్ కరోనా బారినపడ్డారని, ఆయనతో చేయి కలిపిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్వారంటైన్ లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID19  Coronavirus  Shiv Sena  COVID vaccine  COVID cure  Sanjay Raut  Bhabhiji Papad  

Other Articles