Digital classes for intermediate students postponed తెలంగాణ ఇంటర్ విద్యార్థుల డిజిటల్ తరుగతులు వాయిదా

Telangana inter digital classes not to begin today new dates to be announced soon

digital classes, intermediate students, department of education, heavy rain, Doordarshan, T-SAT, Sabitha Indra Reddy, government teachers, Telangana

The department of education, Telangana announced that the digital classes for the intermediate second-year students will not start from today. The government, vide a circular, said that the decision has been taken due to the continuous heavy rain in the state.

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల డిజిటల్ తరుగతులు వాయిదా

Posted: 08/17/2020 09:15 PM IST
Telangana inter digital classes not to begin today new dates to be announced soon

(Image source from: Ndtv.com)

కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యాసంస్థలు అన్ని గత మార్చి నెల నుంచి మూసివేసిన విషయం తెలిసందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ రికవరీ రేటు అధికంగా వుంటున్న నేపథ్యంలో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు పూనుకుంటున్నాయి, ఇందులో బాగంగా ముఖ్యంగా ఇంటర్ విద్యార్తులకు డిజిటర్ తరగతులను నిర్వహించాలని పూనుకుంది. అయితే చివరి నిమిషంలో ఈ డిజిటల్ తరగతుల నిర్వహణను వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ డిజిటల్ తరగతులను వాయిదా పడ్డాయి.

ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి అటు ప్రభుత్వం కానీ ఇటు ఇంటర్ బోర్డు కానీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ తరగతులు జరుగుతాయా.? లేదా.? అన్న విషయంలో సంధిగ్ధత నెలకొనింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా డిజిటల్ భోధన ఎలా వుంటుందన్న విషయాన్ని చూసేందుకు అసక్తి కనబర్చారు.

అయితే విద్యాశాఖ మాత్రం చివరి నిమిషంలో చేసిన కీలక ప్రకటన నేపథ్యంలో వారి ఆసక్తి నీరుగారిపోయింది. డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిజిటల్ తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో సగం మంది ఉపాధ్యాయులు హాజరుకావాలని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవం వాయిదా పడిన నేపథ్యంలో ఉపాధ్యాయులు హాజరుకావాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేశారు. ఈ నెల 20లోగా డిజిటల్‌ తరగతుల నిర్వహణపై స్పష్టత ఇస్తామని మంత్రి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles