Raghurama Raju alleges priority of caste in postings జగన్ సర్కార్ పోస్టింగులలో కుల ప్రాధాన్యత: రఘురామ కృష్ణంరాజు

Raghurama krishnam raju alleges priority of caste in postings

Raghurama Krishnam Raju, posting of Vice Chancellors, YSRCP ‘rebel’ MP, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP 'rebel' Lok Sabha member Raghurama Krishnam Raju alleged that CM Jagan giving priority to reddy community in govt postings.He warned Jagan that it's not good for his government

జగన్ సర్కార్ పోస్టింగులలో కులానికే ప్రాధాన్యత: రఘురామ కృష్ణంరాజు

Posted: 08/14/2020 01:24 AM IST
Raghurama krishnam raju alleges priority of caste in postings

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మరోమారు టార్గెట్ చేశారు వైసీపీ రెబెల్ పార్లమెంటరీ సభ్యుడు రఘురామకృష్ణరాజు. జగన్ ప్రభుత్వం నియమించే పోస్టింగులలో కుల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం పోస్టింగులలో కేవలం ఒక్క కులానికి మాత్రమే ప్రాధాన్యత అధికంగా వుందని, వారి గురించి చెప్పాలంటే పేపర్లు చాలడం లేదని వ్యంగోక్తులు విసిరారు, ఎక్కడ ఏ పోస్టు ఖాళీగా ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారితోనే భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. పొద్దున లేచి పేపర్ చూస్తే రెడ్డి పోస్టింగులకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయని అన్నారు.

కులరహిత క్రిస్టియన్ మతానికి చెందిన వాడని.. జగన్ అన్ని కులాల ప్రజలు స్వాగతించి అధికారాన్ని పట్టం గడితే.. ఆయన మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారని రఘురామ రాజు మండిపడ్డారు. అయితే ప్రభుత్వం నియమిస్తున్న పోస్టింగుల వివరాలన్నింటినీ గమనిస్తున్న ప్రజలు.. పలుపలు విధాలుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమనంతా జగన్ సమానంగా చూస్తాడని భావించి ప్రజలు ఓట్లు వేశారని... ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలంటే అందరికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఏపీ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దేవేందర్ రెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. తన జుట్టు విషయం ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో (ఇటీవలి కాలంలో వైయస్సార్సీపీ అని సంబోధించడాన్ని రఘురాజు ఆపేశారు) దేవేందర్ రెడ్డి పని చేశారని... ఇప్పుడు డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించిందని చెప్పారు. ఆయన పనేదో ఆయన చేసుకుంటే ఇబ్బంది లేదని... తన జుట్టు గురించి ఆయనకెందుకని మండిపడ్డారు. 'గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు, స్వపక్షంలో విపక్షమంటూ’’ రఘురామ పరిస్థితిపై ఆయన కామెంట్లు చేశారు,

‘‘మాటతో సరిపెట్టుకునేదానికి వేటు దాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్టేనా? విగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో?' అని తనపై దేవేందర్ రెడ్డి కామెంట్లు చేశారని రఘురాజు మండిపడ్డారు. 'పిచ్చోడా... నువ్వు సరిగ్గా నిలబడినా నా బొడ్డు వరకు రావు. నీకు నా జుట్టు ఎలా కనపడిందో? అందరూ నీలాగే నల్లగా, పొట్టిగా, వికారంగా ఉండాలని నీవు కోరుకుంటే నేనేమీ చేయలేను. నా జుట్టు ఎలా ఉంటే నీకెందుకు? నా జుట్టుకు నీకు ఏం సంబంధం?' అని మండిపడ్డారు. లోక్ సభ సభ్యుడినైన తనపై నీచమైన వ్యాఖ్యలు చేసిన దేవేందర్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రఘురాజు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles