HC bursts on government over private hospitals తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ప్రశ్నల వర్షం..

Act harsh on erring private hospitals telangana hc to government

coronavirus, Somesh Kumar, chief secretary, High Court, Warning, corona bulliten, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana High Court on Thursday expressed its anguish over the functioning of private hospitals over treating of the COVID-19 patients. A bench of Chief Justice Telangana Raghavendra Singh Chauhan and Vijay Sen Reddy directed the Government to take harsh action against those erring private hospitals that are not complying the Government orders for treating corona patients.

ITEMVIDEOS: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ప్రశ్నల వర్షం..

Posted: 08/13/2020 11:11 PM IST
Act harsh on erring private hospitals telangana hc to government

రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని చెప్పినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పుకనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయస్థానం అదేశాల మేరకు కోర్టుకు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ప్రశ్నలను సంధించింది.

తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. కరోనావైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, ఆక్సిజన్ బెడ్ల కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల అంశంపై సోమేష్ కుమార్ ను న్యాయస్థానం నిలదీసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల సక్సెస్ రేట్ ఎంతన్న విషయాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ టెస్టులతో 40శాతం మాత్రమే కరెక్టు పలితాలు వస్తాయని న్యాయస్థానం పేర్కోంది. ఇలాంటి తరుణంలో ఈ టెస్టులపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో కూడా వెల్లడించాలని అదేశించింది.

రాష్ట్రంలో అనేక జిల్లాలో అక్సిజన్ బెడ్లు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని న్యాయస్థానం తెలిపింది. ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట సహా పలు కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్ల కొరత వుందని న్యాయస్థానం తెలిపింది. స్వియనిర్భంధంలో వున్న రోగుల సౌకర్యార్థం తీసుకువచ్చిన హితం యాప్ పై ప్రజలల్లో ఎంతమేరకు అవగాహన తీసుకువచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. సవిరంగా కరోనా బులిటెన్లను ప్రసారం చేయాలని అదేశాలను జారీచేసినా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలను అందులో పోందుపర్చకపోవడంపై సీఎస్ సోమేష్ కుమార్ ను న్యాయస్థానం నిలదీసింది.

ప్రైవేటు ఆసుపత్రులు రోగుల కుటుంబసభ్యులను డబ్బుకోసం పీడిస్తున్నాయని... దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 ఆసుపత్రులపై పిర్యాదులు రాగా, వాటిలో 46 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు. వాటిలో కేవలం 16 మాత్రమే నోటీసులకు బదులిచ్చాయని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం కన్నా శక్తివంతంగా కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. యాభై అసుపత్రులపై పిర్యాదులు వస్తే కేవలం రెండు ఆసుపత్రులపైనే చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుత్రుల లీజులు ఎందుకు రద్దు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

(Video Source: V6 News Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles