Gold and silver price declines today దిగివచ్చిన బంగారం.. మరింత వన్నె తగ్గనున్న స్వర్ణం

Gold and silver price slashes today as it declines in international market

gold prices today, gold rates today, latest gold prices,mcx gold price,gold price per gram,gold price per 10 gram,silver prices today,silver rates today,mcx silver prices,24 karat gold price, 22 karat gold price, 1gram gold rate,1gram silver rate, gold rate

Gold and silver prices continued to decrease on Wednesday at all major cities after a continuous rise for the last week. On MCX, Gold futures have decreased by Rs. 380 to Rs. 56,640 while the silver also slashed by Rs. 2650 to Rs. 72,500.

దిగివచ్చిన బంగారం.. మరింత వన్నె తగ్గనున్న స్వర్ణం

Posted: 08/12/2020 10:59 PM IST
Gold and silver price slashes today as it declines in international market

మగువల మనస్సు దోచే పుత్తడి.. అందనంత దూరానికి ఎగబాకిందని వారు అలకబూనారని అనుకుందో ఏమో కానీ ఏకంగా గత మూడురోజుల్లో రెండోసారి భారీగా దిగివచ్చింది. శ్రావణమాసంలో కళ్యాణాలు కూడా ముగింపు దశకు చేరుకోవడంతో.. ఇక శుభముహుర్తాలకు పసిడిని కొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోవడంతో బంగారం క్రమంగా వన్నె తగ్గుతోందా.? అంటే అది కూడా ఒక కారణం అయివుండవచ్చునని చెప్పక తప్పదు. శ్రావణ మాసంలో జురిగే కళ్యాణాల నేపథ్యమో.. లేక అంతర్జాతీయంగా ఏర్పడిన డిమాండ్ కారణంగానో కానీ పసిడి ధర ఏకంగా నింగినంటింది.

దాదాపుగా 60 వేల మార్కును అందుకుని కాసింత శాంతించింది. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో నేల చూపులు చూడటంతో మగువలు, మరీ ముఖ్యంగా మధ్యమ ఆదాయవర్గాలకు చెందినవారు హమ్మయ్య అంటూ నిట్టూర్పును విడుస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతుందన్న వార్త కూడా వారికి బారీగా ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 2392 రూపాయలు తగ్గి 52,554 రూపాయలకు పతనమైంది.

ఇక కిలో వెండి ఏకంగా 5080 రూపాయలు తగ్గుముఖం పట్టి 70,314 రూపాయలకు దిగివచ్చింది. డాలర్‌ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. ఇక అమెరికాలో ఆర్థిక ఉద్దీపన ప్రణాళిక పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతోనూ పసిడి కొనుగోళ్లను ప్రభావితం చేసింది. దీంతో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ ధర 2021 డాలర్లకు పడిపోయింది. అమెరికన్‌ డాలర్‌ కోలుకుంటే బంగారం ధరలు మరింత తగ్గుముఖం పడతాయని, బంగారంలో తాజా పెట్టుబడులపై వేచిచూసే ధోరణి అవలంభించాలని కోటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇక కోవిడ్‌-19 కేసుల పెరుగుదలతో ఈ ఏడాది బంగారం ధరలు 35 శాతం పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold prices  silver prices  1gram gold rate  1gram silver rate  gold rate  

Other Articles