(Image source from: Twitter.com/Reuters)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా రెండు లక్షల ముఫై ఐదువేల మార్కును అధిగమించింది, ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఏడు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. ఇవాళ కూడా సుమారు ఏడు వేల మార్కును అధిగమించాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా రెండు లక్షల 35 వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
ఇటీవల రోజరోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వేల పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తమైంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా రెండు లక్షల 35 వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 7665 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 2,35,525 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా పన్నెండు వందల సంఖ్యలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదు కావడం.. దీంతో పాటు మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 631, చిత్తూరు జిల్లాలో 479, తూర్పు గోదావరి జిల్లాలో 1235, గుంటూరు జిల్లాలో 621, కడప జిల్లాలో 439, కృష్ణా జిల్లాలో 146, కర్నూలు 883. నెల్లూరు జిల్లాలో 511, ప్రకాశం జిల్లాలో 450 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 354, విశాఖపట్నం జిల్లాల్లో 620, విజయనగరంలో 574, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,
వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 80 మంది అసువులు బాసారు. చిత్తూరు జిల్లాలో పది మంది ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కడప, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి, గత 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 11 మంది చనిపోయారు. గుంటూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కరోనాతో కన్నుమూశారు. తాజాగా కరోనాతో 80 మంది మృతి చెందారు.
ఇక ప్రకాశంలో జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో పది మంది, పశ్చిమ గోదావారి జిల్లాలో తొమ్మిది, కడపలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఐదుగురు చోప్పున, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు చొప్పున కరోనా వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,116కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,45,636 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 87,773 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Feb 27 | సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు... Read more
Feb 27 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం... Read more
Feb 27 | తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల మీద అడుగులు వేసుకుంటూ అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ అంటే తానొక్కడే అన్న చరిత్రను... Read more
Feb 26 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ... Read more
Feb 26 | యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో... Read more