Serum ties up with gates for corona vaccine doses for India కరోనా వాక్సీన్: గేట్స్ ఫౌండేషన్ తో సెరమ్ సంస్థ ఒప్పందం..

Serum institute ties up with gates foundation for 100 million vaccine doses for india

Coronavirus, Serum Institute, Bill & Melinda Gates Foundation, COVID-19 vaccine, coronavirus india, covid-19 vaccine news, coronavirus india cases, coronavirus india latest update, covid-19 vaccine latest news, GAVI, Serum Institute, Gates Foundation, COVID-19 vaccine, 100 million doses, AstraZeneca, Novavax, covid-19

Serum Institute of India said it would receive $150 million in funding from the Bill & Melinda Gates Foundation and the GAVI vaccines alliance to make 100 million COVID-19 vaccine doses for India and other emerging economies as early as 2021. The candidate vaccines, including those from AstraZeneca and Novavax, will be priced at $3 (Rs 225) per dose and will be made available in 92 countries in GAVI's COVAX Advance Market Commitment (AMC)

గేట్స్ ఫౌండేషన్ తో సెరమ్ సంస్థ ఒప్పందం.. 3 డాలర్లకే కరోనా వాక్సీన్..

Posted: 08/07/2020 11:50 PM IST
Serum institute ties up with gates foundation for 100 million vaccine doses for india

(Image source from: Timesofindia.indiatimes.com)

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పరిశోధనలు సాగుతూనే వున్నాయి. ఈ మహమ్మారి నుంచి మానవాళిని రక్షించుకునే క్రమంలో కరోనా వాక్సీన్ ను కూడా రపోందిస్తున్నాయి. ప్రస్తుతం వాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్న తరుణంలో విజయవంతమైన ఫలితాలు వస్తుండగా, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఈ వాక్సీన్ ను తక్కువ ధరకే విక్రయించేందుకు ఏకంగా 150 మిలియన్ డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ను ముందస్తు ఆర్డర్ ను ఇచ్చి ఒప్పందం చేసుకుంది  గవి, బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సంస్థ. ఈ మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఇక కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఫెవిపిరావిర్, రెమిడిసివీర్ మందులను ఇప్పటికే నల్లజబారులో కొనుగోలు చేస్తున్న ధరలను పక్కనబెడిటే.. అసలు ధర కూడా వేలలో వుండటంతో ఇక వాక్సీన్ ధర ఎంత ఉంటుందో.. ఎంతగా నిర్ణయిస్తారో అన్న అనుమానాలు కూడా మరోవైపు సామాన్యుల మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే కోవిడ్ వాక్సీన్ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) వెల్లడించింది. భారత్ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు గేట్స్‌ ఫౌండేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయోద ధశ పూర్తైన తరువాత ఆక్స్‌ఫర్డ్, నోవావాక్స్‌కు చెందిన వ్యాక్సిన్ లకు 100 మిలియన్ల డోసులను తయారికీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ వాక్సీన్లను భారత్‌ సహా 92 అభివృద్ది చెందుతున్న, చెందని దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాక్సిన్లు 2021 మధ్యకల్లా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తరవాత వాటి ఉత్పత్తి పెంచేందుకు సీరమ్ సంస్థ గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి 150 మిలియన్‌ డాలర్ల మూలధనాన్ని పొందనుంది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైరస్‌ను కట్టడి చేయడానికి పేద దేశాలకు తగిన సహకారం అవసరమని సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రజల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Serum Institute  Gates Foundation  COVID-19 vaccine  100 million doses  AstraZeneca  Novavax  GAVI  

Other Articles