Former AP minister Manikyala Rao dies of Coronavirus మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్నుమూత.. కాటేసిన కరోనా..

Former ap minister manikyala rao dies of coronavirus

former minister, Manikyala Rao, coronavirus, covid-19, covid death, Manikyala Rao dead, BJP leader, BJP Manikyala Rao dead, corona cases, Andhra Pradesh

BJP leader and former minister in the Chandrababu Naidu Cabinet Pydikondala Manikyala Rao who has been undergoing treatment for the last one month breathed his last on Saturday. He was 60. Manikyala Rao was the Endowments Minister in the TDP Cabinet.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్నుమూత.. కాటేసిన కరోనా..

Posted: 08/02/2020 12:27 AM IST
Former ap minister manikyala rao dies of coronavirus

కరోనా మహమ్మారి మహా భయంకరమైన వైరస్. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే పలు దేశాలలోని ప్రముఖులు అస్వస్థతకు గురికాగా, వారిలో కొందరు అనంతవాయువుల్లో కలసిపోయారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడి బీజేపి నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఇటీవలే ఆయన తనకు కరోనా సోకిందని, దాని నుంచి నయమయ్యేందుకు చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. కరోనా డేంజరస్ వైరస్ అని దీని బారిన ఎవ్వరూ పడవద్దని, అత్యవసరం అయితే తప్ప ఎవ్్వరూ ఇళ్ల నుంచి కూడా బయటకు రావద్దని ఆయన సూచిస్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా పంపారు. అయితే ఆయన కోలుకుని ఇంటికి తిరిగివస్తారని ఆయన అనుయాయువులు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్న తరుణంలో ఆయన విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మరణించడంతో ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర బీజేపిలో విషాదం అలుముకుంది.

అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. 1961 నవంబర్‌ 1న తాడేపల్లిగూడెంలో జన్మించిన మాణిక్యాలరావు.. 9 ఏళ్ల వయస్సులోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల ఆకర్షితుడై అందులో చేరారు. బీజేపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఫొటోగ్రాఫర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ -బీజేపి కూటిమి అభ్యర్థిగా 2014లో తాడేపల్లిగూడెం నుంచి పోటీచేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles