Mandatory TET: Don’t terminate our services, say teachers నూతన విద్యా విధానం: ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి..

New education policy 2020 changes in tet bed courses transfer and hiring process

New education policy, Teachers, TET, Interview, Quality Education, Rural Education, Remote areas, Appointment, State School Regulatory Authority, Rashtriya Shiksha Aayog, Ministry of Education, new education policy, new education policy 2020, national education policy, national education policy latest news, national education policy news, New Education Policy 2020, New Education Policy, New Education Policy 2020 Highlights, New Education Policy 2020 Latest Updates, New Education Policy In India, Grading System, Ministry Of Education, New Education Policy Pdf

Not just changes in TET and BEd courses, NEP also suggests policies for teachers who have already been hired including mandatory courses, setting up of national professional standards, no transfer policy and digital management of hiring and vacancies in schools across country.

నూతన విద్యా విధానం: ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి..

Posted: 07/31/2020 11:32 PM IST
New education policy 2020 changes in tet bed courses transfer and hiring process

దేశంలో నూతన విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చిన కేంద్రం ఈ ఏడాది నుంచి ఉపాధ్యాయుల నియామకాల్లోనూ సమూల మార్పులను తీసుకువచ్చేందుకు సంకల్పించింది. డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులలో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇప్పటి వరకు గ్రామీణ, మారుమూల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో తాత్సారం జరిగిందన్న వాదనల్లో కేంద్రం ఇకపై ఎలాంటి అలసత్వాలు లేకుండా వారికి కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల నియామకాల్లోనూ మార్పులు చేసింది. ఉపాద్యాయుల నియామకాలను మరింత కఠినతరం చేసింది. 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తో పాటు తరగతి గది బోధన లేదా ముఖాముఖి(ఇంటర్వూ)నీ ఇందులో భాగం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికీ ఆ నిబంధనలను తప్పనిసరి చేసింది. ముఖాముఖిలో భాగంగా స్థానిక భాషలో వారికున్న ప్రావీణ్యాన్నీ పరిశీలిస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని చాలా పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు స్థానిక బాషల్లో ప్రావిణ్యం వున్నా.. టెట్‌ రాయలేదు. ఇక రాష్ట్రాల్లో టెట్ పరీక్షలు కూడా ప్రభుత్వ నిర్వహించడం లేదు. పలు రాష్ట్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించి మూడేళ్లు కూడా కావస్తోంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కార్పొరేట్‌ పాఠశాలల్లో బీటెక్‌ అభ్యర్థులూ బోధిస్తున్నారు.

ఈ విధానం అమల్లోకి వస్తే వారందరూ టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. పాఠశాల విద్యలో నాలుగు దశలు ఉన్నందున అన్ని దశల్లో పనిచేసే గురువులకు టెట్ ను విస్తరిస్తారు. అంటే శిశు తరగతులకు బోధించే వారికీ ఇది తప్పనిసరి కానుంది. భారతీయ సంస్కృతి, కళలు, వృత్తి విద్యను చదువులో భాగం చేస్తామని పేర్కొన్న కేంద్రం ఆయా నిపుణులను ఆయా పాఠశాలలు లేదా స్కూల్‌ కాంప్లెక్స్‌లు నియమించుకునే వెసులుబాటు కల్పించింది. స్థానికంగా ప్రముఖ వ్యక్తులనూ ఇన్‌స్ట్రక్చర్లుగా నియమించుకోవచ్చని తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత త్రీవంగా ఉన్నచోట పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలు(స్థానికంగా లేదా పాఠశాల ఆవరణలో ఇల్లు సమకూర్చడం లేదా ఇంటి భత్యం పెంచడం వంటివి) ఇస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles