Oxford vaccines prevent infection in monkeys ఆశలు సజీవం చేస్తున్న ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సీన్

Covid 19 vaccine astrazeneca reports oxford vaccines prevent infection in monkeys

COVID 19, Coronavirus, Oxford university, covid-19 vaccine, oxford vaccine trials, coronavirus vaccine, astrazeneca, who

In what could be termed as the biggest breakthrough of the year in the fight against the novel coronavirus pandemic, preliminary results showed Oxford/AstraZeneca COVID-19 vaccine candidate is safe and induced immune response. WHO gives its take on the Oxford vaccine trials, says that the results are positive but have a long way to go.

ఆశలు సజీవం చేస్తున్న ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సీన్

Posted: 07/31/2020 05:11 PM IST
Covid 19 vaccine astrazeneca reports oxford vaccines prevent infection in monkeys

(Image source from: Dailyasianage.com)

కరోనా మహమ్మారి నియంత్రణకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ పై ఎక్కువ మంది నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో ఆ ఆశలను నిజం చేస్తూ.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాము ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనికా టీకా కరోనా వైరస్‌తో సమర్థంగా పోరాడగలదని.. సురక్షితమైనదిని వెల్లడించిన నేపథ్యంలో తాజాగా మరో అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కొతుల్లో వైరస్ శాతాన్ని తగ్గించడంలో ఇది దోహదపడిందని, ఊపిరి తిత్తులు దెబ్బతినకుండా కూడా కాపాడిందని నిర్థారించింది.

అయితే కరోనావైరస్ బారిన పడకుండా ముందే పూర్తిగా నివారించడం మాత్రం వాక్సీన్ కు సాధ్యం కాదన్న అనుమానాలను వ్యక్తం చేసింది. సాధారణంగా కరోనా వైరస్‌ తన స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారా మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో సదరు ప్రొటీన్ ను నిలువరించే టీకాల అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. సాధారణ జలుబు వంటి అనారోగ్యాన్ని కలిగించే అడినోవైరస్‌లోనూ ఇలాంటి ప్రొటీన్‌ ఉంటుంది. దీంతో అడినోవైరస్‌ను బలహీనపర్చడం ద్వారా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ‘సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌-19’ అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేశారు.

కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఏఐడీ), ఆక్స్ ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా పరిశీలించారు. తమ అధ్యయనంలో భాగంగా ఆరు కోతులకు పరిశోధకులు టీకా అందించారు. అనంతరం 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్‌ కారణంగా తలెత్తే న్యుమోనియాను టీకా నిలువరించగలిగినట్లు గుర్తించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను కూడా అది రాబట్టగలిగినట్లు తేల్చారు. కాగా మరిన్ని ఫలితాల కోసం చివరి దశగా ఆక్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తమ వాక్సీన్ ను వృద్ధులపై ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు ప్రయోగాల పూర్తి ఫలితాలు వస్తాయని ఆక్స్‌ఫర్డ్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles