Priyanka Gandhi Invites New Occupant For Tea బీజేపి ఎంపీని టీ కి ఆహ్వానించిన ప్రియాంకా గాంధీ..

Priyanka gandhi invites bjp mp anil baluni for tea before vacating bunglow

Priyanka Gandhi Vadra, government bungalow, Anil Baluni, BJP leader Anil Baluni, 35 Lodhi State bungalow, BJP MP, Gurgaon, Sector 42, bunglow, Haryana, Pent House, National Politics

Ahead of vacating her government bungalow, Congress general secretary Priyanka Gandhi Vadra has invited BJP leader Anil Baluni, who has been allotted the premises for accommodation, along with his wife for a cup of tea.

బీజేపి ఎంపీ అనిల్ బాలూను టీ కి ఆహ్వానించిన ప్రియాంకా గాంధీ..

Posted: 07/27/2020 08:49 PM IST
Priyanka gandhi invites bjp mp anil baluni for tea before vacating bunglow

మనుషులతో మనుషులకు అనుబంధాలు సన్నగిల్లుతున్నా.. కొన్ని వస్తువులు, ఇళ్లతో మాత్రం బంధాలను పెనవేసుకుంటాం. ఇక అలాంటి ఇల్లు తమకు కలసివచ్చిందని భావిస్తే.. ఎన్ని వ్యయప్రయాసలైనా పడి అదే ఇంట్లో వుండేందుకు అమితాసక్తిని చూపుతాం. అలా గత 23 ఏళ్లుగా ఒకే నివాసంలో వుంటున్న కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తున్న తరుణంలో అమె కుటుంబానికి ఆసరాను ఇచ్చిన ఇంటిలోకి రానున్న మరో ఎంపీని అమె మర్యాదపూర్వకంగా కుటుంబసమేతంగా తన ఇంటికి ఆహ్వనించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ బంగళాలో సుమారు పాతికేళ్ల అనుబంధాన్ని పెనువేసుకున్న ఇంటిని ప్రియాంకా గాంధీ తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు ఖాళీ చేయాల్సివస్తోంది. ఆగస్టు ఒకటో తేదీ లోపు తన బంగళాను ఖాళీ చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో పేర్కోంది. దీంతో అందుకు సమ్మతించిన ఆమె హర్యానుకు బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రియాంక ప్రస్తుతం నివసిస్తున్న బంగళాను బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనికి కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ టీ తాగేందుకు రావాలంటూ బలూనిని ఆహ్వానించారు. భార్యతో కలిసి తేనీటి విందుకు రావాలంటూ కోరారు.

ఈ మేరకు పార్లమెంటు సభ్యుడికి ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ.. ఆయన కార్యాలయానికి లేఖ కూడా పంపారు. అయితే, బలూని నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లేదని సమాచారం.ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ బంగళాలోనే ఉంటున్నారు. ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో బంగళాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు నోటీసులు పంపింది. దీంతో బంగళాను ఖాళీ చేస్తున్న ప్రియాంక హరియాణలోని గురుగ్రామ్‌కు తన నివాసాన్ని మార్చనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi  Anil Baluni  BJP MP  Gurgaon  Sector 42  bunglow  National Politics  

Other Articles