Sex racket busted in Agra farmhouse, hotels ఆగ్రా ఫాంహౌజ్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు..

Agra police busts syndicate of farmhouse guest house and hotel running sex racket

Sex-trafficking politician's farmhouse, Sex-racket BJP Leader, ASP Saurabh Dixit, Sikandra sex racket, Agra, Sex-trafficking, Sex-Racket, BJP Leader, Farmhouse, sex racket busted in agra, ex- Agra unit BJP president Ashok Rana, ashok rana s kamla, Agra police busts syndicate of farmhouse, Uttar Pradesh, Crime

The Agra Police have busted a sex racket being run in a private farmhouse in Sikandra owned by a BJP politician, guest houses and hotels. According to the police, an FIR has been lodged in the matter by Additional Superintendent of Police, Saurabh Dixit. After a raid police arrested 12 people, including three women from Kolkata.

బీజేపి నేత ఫాంహౌజ్ లో పోలీసుల దాడి.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Posted: 07/27/2020 01:29 PM IST
Agra police busts syndicate of farmhouse guest house and hotel running sex racket

యూపీలో ఓ భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు బయటపడింది. ఆగ్రా సమీపంలోని ఓ ఫాం హౌజ్ కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ దందా కొనసాగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. పోలీసులు ఆకస్మిక దాడులు చేయడంతో ఈ సెక్స్ రాకెట్ బండారం బయటపడింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో పాటుగా మరో ఆరుగురిని ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేత, ఆ పార్టీ ఆగ్రా జిల్లా మాజీ అధ్యక్షుడి ఫాంహౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పాటు పలు హోటళ్లపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. ఆగ్రా పోలీసులు కళ్లుగప్పి కొందరు ప్రముఖుల అండదండలతోనే ఈ అక్రమ సెక్స్ రాకెట్ నడుస్తోందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయిల బుకింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న సచిన్, విశాల్, గోయల్‌ తోపాటు విజయ్, రణ్ వీర్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠాలో కొందరు ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆగ్రా ఎస్సెస్పీ సౌరబ్ దీక్షిత్ తెలిపారు. అమ్మాయిలను తొలుత ఫామ్ హౌస్ కు తీసుకొస్తారని, ఆపై వివిధ హోటళ్లతోపాటు విటుల వద్దకు పంపిస్తారని వివరించారు. కోల్ కత్తాకు చెందిన ముగ్గురు మహిళలు సహా మొత్తం తొమ్మిది మందిని విచారిస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని సౌరబ్ దీక్షిత్ తెలిపారు. ఈ కేసులలో పలువురు ప్రముఖులు, హోటల్ యాజమాన్యాలకు చెందిన కీలక సభ్యులు కూడా వున్నారని తెలిపారు.

అయితే ప్రస్తుతం వారంతా పరారీలో వున్నారని, అయినా వారందరినీ తప్పక అరెస్టు చేస్తామని సౌరబ్ దీక్షిత్ తెలిపారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కూడా ఈ కేసును నుంచి తనను తాను దూరం చేసుకునే ప్రయత్నంలో వున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఫాంహౌస్ తనదే అయినా సచిన్, విష్ణు, గోయల్ కు మూడేళ్ల క్రితమే లీజుకు ఇచ్చేశానని, అక్కడ జరుగుతున్న దానితో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే వారు అక్కడ ఏం చేస్తున్నారన్నది తనకు తెలియదని.. ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో కానీ.. ఘటనకు సంబంధించి కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఆరోపించారు. కాగా, మూడేళ్లుగా ఇక్కడి నుంచి సెక్స్ రాకెట్ జరుగుతోందా.? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles