YCP MP on SC directions to reinstate nimmagadda as SEC సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవిస్తారా.?: వైసీపీ ఎంపీ

Ysrcp mp questions whats wrong on nimmagadda reinstate as sec

Supreme Court, YSRCP Government, Narsapuram Parliamentarian, nimmagadda Ramesh, Nimmagadda Ramesh Kumar, State Election Commission, Delhi High Court, Rama Raju, VijaySai Reddy, General Secretary, Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

Narsapuram parliamentaty constituency YSRCP Parliamentarian Raghurama Krishnam Raju had questioned the Andhra Pradesh Government on what's wrong with Nimmagadda Ramesh Kumar being reinstated as State Election Commissioner.

నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమిస్తే నష్టమేంటీ: వైసీపీ ఎంపీ సూటి ప్రశ్న

Posted: 07/24/2020 09:17 PM IST
Ysrcp mp questions whats wrong on nimmagadda reinstate as sec

వైసీపీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు అవకాశం దొరికిన ప్రతీసారి సొంత పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటీ.? అని ఆయన ప్రశ్నించారు. ఇదివరకే రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలుపర్చకుండా దానిపై స్టే కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడమేంటని ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థను గౌరవించలేని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం సందేశాన్ని అందిస్తోందని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడదామని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవించి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడమేనా ఆయన చేసిన తప్పు అని ప్రశ్నించారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రభుత్వ తప్ప రాష్ట్ర ప్రజలందరూ ఆయన నిర్ణయం సముచితమైనదేనన్న అభిప్రాయంలో వున్నారని రఘురామ అన్నారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని అన్నారు. ఇక పనిలో పనిగా తన విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చిన రఘురామ ప్రభుత్వానికి సూచన చేయడమేతప్ప అవుతోందని అన్నారు. తనపై వేటు వేస్తే ఏకంగా రాష్ట్రంలోని 22 మంది ఎంపీల మద్దతును అప్పగిస్తానని.. ఢిల్లీకి వచ్చి వేడుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా అత్యంత మెజార్టీతో గిలిచిన ప్రభుత్వం.. తన కొఠారి మాటలు విని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సబబుకాదని అన్నారు. రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని కొద్దిమంది తనపై ఫిర్యాదు చేస్తే ఏమౌతోందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతు నొక్కేస్తారా?. ఇది రాచరికం పాలన అనుకుంటాన్నారా.? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles