Telanganas test positivity rate plunges తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. పడిపోయిన టీపీ రేట్.!

Coronavirus test positivity rate in telangana plunges

COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, Maharashtra, Telangana, test positivity rate, RT-PCR, rapid antigen test, Telangana coronavirus

The COVID-19 test positivity rate (TPR) in Telangana, which was much higher than other States until earlier this month, is on a downward trajectory. The highest of 21.98% cumulative positivity rate on July 9. Nearly two weeks after the tests it gradually dropped to 16.75% on July 20.

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. పడిపోయిన టీపీ రేట్.!

Posted: 07/23/2020 04:39 PM IST
Coronavirus test positivity rate in telangana plunges

తెలంగాణలో కరోనా వైరస్ టెస్టులపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు కరోనా రోగులకు సంబంధించిన గణంగాలను రాష్ట్రానికి అంతజేసి.. వాటి ప్రతులను కూడా వెబ్ సైట్ లో పోందుపర్చాలని అదేశించింది. అదే సమయంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ జారీ చేసి బులెటిన్ వివరాలను కూడా సమగ్రంగా పొందుపర్చాలని అదేశించింది. ఇక ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న టెస్టులకు.. తెలంగాణలో చేపడుతున్న టెస్టులకు మద్య అంత వత్యాసం ఎందుకుందీ అని కూడా ప్రశ్నింది. దీంతో ప్రభుత్వం టెస్టులను సంఖ్యను గణనీయంగా పెంచడంతో టెస్టులు సంఖ్య తక్కువగా ఉందని వస్తున్న విమర్శలకు చెక్ పడింది.

టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచగా, పాజిటివ్ వస్తున్న కేసుల గణాంకాలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో టెస్ట్ పాజిటివ్ రేట్ (టీపీఆర్) తగ్గిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ నెల 9వ తేదీన పరీక్షించిన నమూనాల్లో నూటికి 21.98 శాతం పాజిటివ్ రాగా, ఆపై రెండు వారాల వ్యవధిలోనే ఈ శాతం 16.75కు పడిపోయింది. దీంతో రెండు వారాల క్రితం వరకూ టీపీఆర్ విషయంలో ఆందోళన కలిగించిన రాష్ట్రంలోని పరిస్థితులు ఇప్పుడు కాస్తంత కుదుటబడ్డట్లయింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను ప్రభుత్వం క్రమంగా పెంచుతూ ఉండటమే ఇందుకు కారణం.

ఇదిలావుండగా, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చి, ఆపై నమూనాలను ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కు పంపుతున్న గణాంకాలను మాత్రం రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. జూన్ మూడవ వారం వరకూ రాష్ట్రంలో టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న విమర్శలు రాగా, ఆపై క్రమంగా నమూనాల సేకరణ, పరీక్షలు పెరుగుతూ వచ్చాయి. జూన్ నెలాఖరు నాటికి 18.4 శాతంగా ఉన్న టీపీఆర్, ఆపై మరింతగా పెరిగింది. దీంతో అధికారులు ఆందోళనకు గురైనప్పటికీ, కట్టడి చర్యలను సమర్థవంతంగా చేపట్టారు. ఫలితంగా టీపీఆర్ తగ్గుతూ వచ్చింది. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles