CBI Begins Probe Into Viveka Murder Case! వైఎస్ వివేకా హత్యకేసులో సీబిఐ విచారణ షురూ.!

Cbi begins probe into y s vivekananda reddy murder case

CBI, Y S Vivekananda Reddy, Y S Viveka Murder case, YSRCP, TDP, YS Sunitha, Kadapa SP, K K Anburajan, High court, Andhra Pradesh, Crime, Politics

The Central Bureau of India (CBI) on Saturday commenced the investigation into the murder of former MP Y S Vivekananda Reddy, uncle of YSR Congress party president and CM Y S Jagan Mohan Reddy, nearly one-and-a-half years of the incident. The murder took place at Pulivendula on March 15, 2019.

వైఎస్ వివేకా హత్యకేసులో సీబిఐ విచారణ షురూ.!

Posted: 07/18/2020 09:34 PM IST
Cbi begins probe into y s vivekananda reddy murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఇవాళ ప్రారంభించింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కడప ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ తో ఏడుగురు  అధికారులు సమావేశమయ్యారు. ఆ తరువాత కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో సీబిఐ అధికారులు కేసును విచారణను ప్రారంభించారు. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.

వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టి ధర్మాసనం నాలుగు నెలల ముందే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ‘మిస్టరీ’ ఇంకా వీడలేదని అప్పట్లో వ్యాఖ్యానించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)/రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఈ కేసుపై మూడు సార్లు విచారణ చేపట్టారు. దాదాపు 1300 మంది అనుమానితులను విచారించారు. అయినప్పటికీ హంతకులను గుర్తించలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.

హత్యకు రాజకీయ కారణాలా?, భూమి, ఆస్తి తగాదాలా అనే విషయాలను సిట్‌ తేల్చలేకపోయిందని చెబుతూ..హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహం హైకోర్టు వెలిబుచ్చింది. ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం చాలా కీలకమైందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈకేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి, ‘తుది నివేదిక’ను దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. ఈ కేసుకు చెందిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  Y S Vivekananda Reddy  Y S Viveka Murder case  YSRCP  High court  Andhra Pradesh  Crime  Politics  

Other Articles